కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు ఆలమట్టికి ఎగువన కృష్ణా నది పరీవాహకంలోని ఉప నదుల నుంచి భారీ ప్రవాహం వస్తోంది. గురువారం 13 వేల క్యూసెక్కులు ఉన్న వరద క్రమంగా పెరిగి శనివారం నాటికి లక్ష క్యూసెక్కులను దాటింది. గత ఏడాది కృష్ణానదికి జూన్ 16న వరద మొదలైంది. అయితే ఈ ఏడాది జూరాలకు ముందుగానే (ఈ నెల 5 నుంచే) ప్రవాహం ప్రారంభమైంది. నారాయణపూర్ జలాశయం నుంచి విద్యుత్తు ఉత్పత్తి, దిగువన ఉన్న బ్యారేజీల్లో నిల్వ కోసం నీటిని విడుదల చేయడంతో అది జూరాల జలాశయానికి వచ్చి చేరింది.
ప్రస్తుతం జూరాలలో 2.03 టీఎంసీల ఖాళీ మాత్రమే ఉంది. కర్ణాటకలో తుంగభద్ర నదీ పరీవాహకంలో వర్షాలు ఉండటంతో ఈ ప్రాజెక్టుకు కూడా 21 వేల క్యూసెక్కులకు పైగా ప్రవాహం వచ్చి చేరుతోంది. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో గోదావరికి వారం రోజుల నుంచే ప్రవాహం ప్రారంభమైంది. దీంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు రోజుకు ఒకటిన్నర నుంచి రెండు టీఎంసీల వరకు జలాలు వచ్చి చేరుతున్నాయి. గోదావరి నదిపై ఉన్న చివరి ప్రాజెక్టు ధవళేశ్వరం ఆనకట్ట నీటి మట్టం 45 అడుగులకు గాను 43.70 అడుగుల స్థాయిలో నీళ్లు ఉన్నాయి.
మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి ఎత్తిపోత...