ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద ఏపీ సీఎం జగన్ నివాళులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతిని పురస్కరించుకుని బుధవారం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ఏపీ సీఎం జగన్, అతని కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. అనంతరం ఇడుపులపాయ నుంచి జగన్ కడప విమానాశ్రయానికి హెలికాఫ్టర్లో బయలుదేరారు. కడప విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం వెళ్లనున్నారు.
- నా ప్రతి అడుగులోనూ తోడుగా ఉంటూ...
నాన్న మన మధ్య నుంచి దూరమై నేటికి 11 ఏళ్లు అయ్యిందని సీఎం జగన్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఆ మహానేత శరీరానికి మరణం ఉంటుంది కానీ ఆయన జ్ఞాపకాలు, పథకాలకు కాదని జగన్ అన్నారు. నా ప్రతి అడుగులోనూ నాన్న తోడుగా ఉంటూ ముందుకు నడిపిస్తూనే ఉన్నారన్నారు సీఎం జగన్.
ఇదీ చదవండి :భద్రాచలం వద్ద 41 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం