ఏపీ విశాఖపట్నంలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్)కు చెందిన విశాఖ్ రిఫైనరీ ఆధునికీకరణ(వీఆర్‌ఎంపీఎల్) ప్రాజెక్టు కోసం ప్రపంచంలోనే అతి భారీ రియాక్టర్ త్వరలో చేరుకోనుంది. ఈ రియాక్టర్ పొడవు 71.5 మీటర్లు, వెడల్పు 12.2 మీటర్లు, ఎత్తు 7.74 మీటర్లు. బరువు 2200 టన్నులు. దీన్ని షిప్‌యార్డు తీరంలోని జెట్టీ నుంచి సింధియా కూడలి, ఐఓసీ టర్మినల్ రోడ్డు మీదుగా ప్రాజెక్టులోకి తరలించనున్నారు.
విశాఖలోని హెచ్‌పీసీఎల్‌కు 2200 టన్నుల రియాక్టర్!
ఏపీ విశాఖలోని హెచ్‌పీసీఎల్‌కు చెందిన విశాఖ్ రిఫైనరీ ఆధునికీకరణ ప్రాజెక్టు కోసం ప్రపంచంలోనే అతి భారీ రియాక్టర్ త్వరలో చేరుకోనుంది. దీన్ని షిప్‌యార్డు తీరంలోని జెట్టీ నుంచి సింధియా కూడలి, ఐఓసీ టర్మినల్ రోడ్డు మీదుగా ప్రాజెక్టులోకి తరలించనున్నారు.
విశాఖలోని హెచ్‌పీసీఎల్‌కు 2200 టన్నుల రియాక్టర్!
దీనికి 32 ఇరుసులతో కూడిన భారీ ట్రాలర్‌ను వినియోగిస్తున్నారు. ఒక్కో ఇరుసుకి మూడు ట్రాక్‌లుగా ఉండగా, ఒక్కో ట్రాక్‌కి రెండు జతల్లో 8 చక్రాల చొప్పున ఒక్కో ఇరుసుకి 24 చక్రాలు ఉన్నాయి. మొత్తం 768 చక్రాలు బిగించిన ఏక ట్రాలర్‌పై తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
- ఇదీ చదవండి :గతేడాది హైదరాబాద్ వరదలపై నీతి ఆయోగ్ నివేదిక
TAGGED:
Reactor