తెలంగాణ

telangana

ETV Bharat / city

కుంభ్‌ సందేశ్‌ యాత్రను ప్రారంభించిన ఎమ్మెల్సీ కవిత - తెలంగాణ వార్తలు

మిషన్‌ 5151 పేరిట కుంభ్‌ సందేశ్‌ యాత్రను ఎమ్మెల్సీ కవిత ప్రారంభించారు. ఈ యాత్ర దేశంలోని పలు ప్రాంతాలను సందర్శిస్తూ.. హరిద్వార్‌కు చేరుకోనుంది. 41 రోజుల పాటు యాత్ర సాగనుంది. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ఈ యాత్రను హైదరాబాద్​లో ప్రారంభించారు.

The Kumbha Sandesh Yatra was started by mlc kavitha in hyderabad
కుంభ్‌ సందేశ్‌ యాత్రను ప్రారంభించిన ఎమ్మెల్సీ కవిత

By

Published : Feb 19, 2021, 2:31 PM IST

ప్రపంచ దేశాలకు భారతదేశం విశ్వగురువు స్థానంలో ఉండటం గర్వకారణమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. గ్రామోదయ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ టెక్నాలజీ ఆధ్వర్యంలో మిషన్‌ 5151 పేరిట కుంభ్‌ సందేశ్‌ యాత్రను ప్రారంభించారు. ఈ యాత్రను హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని పెద్దమ్మ గుడి నుంచి ఎమ్మెల్సీ కవిత జెండా ఊపి ప్రారంభించారు.

మరోమారు నేర్పుతున్నాం..

పూర్వకాలంలో ప్రపంచదేశాలకు మన పెద్దలు పాఠాలు నేర్పించారని.. కరోనా వల్ల ఇప్పుడు మన సంస్కృతి, సంప్రదాయాలను మరోమారు నేర్పుతున్నామని కవిత అన్నారు. సంస్కృతి, సాంప్రదాయాలను భావితరాలకు అందించడంతో పాటు కుంభమేళ ఆవశ్యకతను తెలియజేసేందుకు యాత్రను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. కరోనా వంటి పరిస్థితుల్లో ఇలాంటి యాత్ర చాలా అవసరమన్నారు.

అవగాహన యాత్ర

హైదరాబాద్‌ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర దేశంలోని పలు ప్రాంతాలను సందర్శిస్తూ.. హరిద్వార్‌కు చేరుకుంటుందని సామాజికవేత్త శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. 41 రోజుల పాటు యాత్ర సాగుతుందని.. దిల్లీ నుంచి హరిద్వార్‌ వరకు దాదాపు 100 మందితో పాదయాత్ర సాగుతుందని చెప్పారు. పాశ్చాత్య సంస్కృతి మోజులో పడిన యువతను మన సంస్కృతి, సంప్రదాయాలను పాటించే విధంగా అవగాహన యాత్ర నిర్వహించడం సంతోషంగా ఉందని ఆధ్యాత్మిక వేత్త సత్యవాణి అన్నారు.

కుంభ్‌ సందేశ్‌ యాత్రను ప్రారంభించిన ఎమ్మెల్సీ కవిత

ఇదీ చూడండి: న్యాయవాద దంపతుల హత్య కేసులో బిట్టు శ్రీను అరెస్టు

ABOUT THE AUTHOR

...view details