తెలంగాణ

telangana

By

Published : Jun 16, 2021, 7:56 AM IST

ETV Bharat / city

భూములపై హక్కులను తేల్చే పరిధి మీకు ఎక్కడిది?

భూములపై హక్కులను తేల్చే పరిధి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​కు (state Human Rights Commission) ఎక్కడుందని హైకోర్టు ప్రశ్నించింది. రంగారెడ్డి జిల్లా రాయదుర్గ్ గ్రామంలోని 2 వేల కోట్ల విలువైన భూముల హక్కులను నిర్ణయిస్తూ.. కమిషన్ ఉత్తర్వులు ఇవ్వటంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కమిషన్ తీర్పు అములును నిలిపి వేస్తూ... మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.

The High Court questioned where the jurisdiction over land rights rests with the state Human Rights Commission
High Court: భూములపై హక్కులను తేల్చే పరిధి మీకు ఎక్కడిది?

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గ్ గ్రామంలో 2 వేల కోట్ల విలువైన భూముల హక్కులను నిర్ణయిస్తూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (state Human Rights Commission) ఉత్తర్వులు ఇవ్వటంపై హైకోర్టు (High Court) ఆశ్చర్యం వ్యక్తం చేసింది. భూములపై హక్కులను తేల్చే పరిధి కమిషన్​కు ఎక్కడుందని ప్రశ్నించింది. అందులోనూ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో కేసులు పెండింగ్​లో ఉండగా.. కమిషన్ ఎలా తేలుస్తుందని, న్యాయస్థానాల కన్నా కమిషన్​కు అత్యున్నత అధికారాలు ఉన్నాయా అని ప్రశ్నించింది.

రాయదుర్గ్​లోని సర్వే నంబర్ 46లో 84.30 ఎకారాల భూములను లార్వెన్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్, సయ్యద్ రహీముల్లా హస్సేనికి అప్పగించాలని భూపరిపాలన ప్రధాన కమిషనర్​ను ఆదేశిస్తూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఏప్రిల్ 12న ఇచ్చిన తీర్పు అమలును నిలిపి వేస్తూ... హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. హక్కుల కమిషన్ తీర్పునకు సంబంధించిన వ్యవహారంపై ప్రతివాదులైన రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శి, సీసీఎల్ఏ, కలెక్టర్, పోలీస్ కమిషనర్, రాయదుర్గం ఎస్ఎచ్వో, డీజీపీ, లార్వెన్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్, సయ్యద్ రహీముల్లాలకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను సెప్టెంబర్ 13వ తేదీకి వాయిదా వేసింది.

ఇదీ చూడండి:CJI NV Ramana: 'అదే నా చిరకాల స్వప్నం'

ABOUT THE AUTHOR

...view details