హైదరాబాద్‌లోని అల్వాల్‌కు చెందిన హరీశ్ భీమర్తి.. 2019లో విదేశాలకు వెళ్లేందుకు ప్రణాళిక వేసుకున్నారు. టికెట్ బుకింగ్ కోసం ఆన్లైన్లో వెతుకుతుండగా.. 'మేక్ మై ట్రిప్'(makemytrip.com) డాట్ కామ్‌లో ఓ ఆఫర్ ఆకర్షించింది. అతి తక్కువ ధరకే టికెట్ అమ్ముతామని ఆ ఆఫర్ సారాంశం. టికెట్ కొనుగోలు చేసిన 24 గంటల్లో అంతకన్నా తక్కువ ధరకే ఇతర ఆన్లైన్ ట్రావెల్ ఏజెన్సీలు అమ్మితే.. తమకు చెల్లించిన సొమ్ముకు ఐదింతలు.. గరిష్ఠంగా రూ.10వేలు వ్యాలెట్‌లో జమ చేస్తామని ఆఫర్ ఇచ్చింది. ఆఫర్ నచ్చడంతో హరీష్ 2019 సెప్టెంబరు 6న నాలుగు అంతర్జాతీయ టికెట్లు కొనుగోలు చేశారు. హైదరాబాద్ నుంచి కౌలలంపూర్‌కు.. అక్కడి నుంచి డెన్‌పసర్‌కు... మళ్లీ డెన్పసర్ నుంచి కౌలలంపూర్‌కు.. అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చేలా టికెట్లు కొన్నారు.
అంతకన్నా తక్కువకే ఇతర ఏజెన్సీల్లో టికెట్లు..
టికెట్లు కొనుగోలు చేసిన తర్వాత ఇతర ఆన్లైన్ ట్రావెల్ ఏజెన్సీలను పరిశీలించారు. క్లియర్ ట్రిప్, ఈజీ మైట్రిప్‌లో అంతకన్నా రూ.6వేలు తక్కువకే అమ్ముతున్నట్లు గుర్తించారు. వెంటనే స్క్రీన్ షాట్లు తీసి.. మేక్ మై ట్రిప్‌కు మెయిల్ చేశారు. బెస్ట్ ప్రైస్ గ్యారంటీ స్కీం ప్రకారం ఒక్కో టికెట్ కు రూ.10 వేల రూపాయలు చెల్లించాలని కోరారు. మేక్ మై ట్రిప్ నుంచి స్పందన లేకపోవడంతో హైదరాబాద్ జిల్లా రెండో వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఒక్కో టికెట్ కు రూ.10 వేలను 12 శాతం వార్షిక వడ్డీతో చెల్లించడంతో పాటు.. మానసిక వేదన కలిగించినందుకు రూ.3 లక్షలు.. ఖర్చుల కింద రూ.20వేలు చెల్లించేలా ఆదేశాలివ్వాలని కోరారు.
ఆఫర్ అందరికీ వర్తించదు.. షరతులు ఉన్నాయి