తెలంగాణ

telangana

ETV Bharat / city

"షెడ్యూల్ ప్రకారం... ఎన్నికలు నిర్వహించడం సవాల్‌" - telangana municipal elections updates

హైదరాబాద్ రాజేంద్రనగర్ ఎన్ఐఆర్డీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ల సదస్సు జరిగింది. ఎన్ఐఆర్డీపీఆర్, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సును కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రారంభించారు. ఎన్నికల నిర్వహణలో ఎదురయ్యే సమస్యపై అందరు దృష్టి సారించాలని ఎస్​ఈసీ నాగిరెడ్డి కోరారు.

The challenge of holding elections as per schedule
"షెడ్యూల్ ప్రకారం... ఎన్నికలు నిర్వహించడం సవాల్‌"

By

Published : Jan 9, 2020, 11:47 AM IST

రాష్ట్రంలో ఎన్నికలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించడం పెద్ద సవాల్‌గా మారిందని ఎస్‌ఈసీ నాగిరెడ్డి అన్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ ఎన్ఐఆర్డీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ల సదస్సులో ఆయన ప్రసంగించారు. ఎన్ఐఆర్డీపీఆర్, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సును కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రారంభించారు.

ఎన్నికల కోసం ఎంత ప్రయత్నించినా కొన్నిసార్లు ఎక్కువ సమయం తీసుకుంటోందని.. ఓటర్లలో చైతన్యం తీసుకురావడానికి కనీస సదుపాయాలు అందుబాటులో ఉండట్లేదని నాగిరెడ్డి పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల రోజు ఎందుకు సెలవు ఇవ్వకూడదని నాగిరెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల నిర్వహణలో ఎదురయ్యే సమస్యపై అందరు దృష్టి సారించాలని కిషన్​రెడ్డి కోరారు. భవిష్యత్‌లో రాష్ట్ర ఎన్నికల సంఘాలు మరింత బలోపేతమవుతాయని.. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.

"షెడ్యూల్ ప్రకారం... ఎన్నికలు నిర్వహించడం సవాల్‌"

ఇవీ చూడండి: ఖరారైన తెరాస అభ్యర్థుల జాబితా... ఇవాళ బీఫారాల అందజేత

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details