ఈ నెల 29 నుంచి ప్రారంభమవుతున్న లోక్సభ శీతాకాల సమావేశాల(parliament winter session) నేపథ్యంలో.. రేపు తెరాస పార్లమెంటరీ పార్టీ భేటీ (trs parliamentary party meeting) కానుంది. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, కేంద్రంపై సీఎం కేసీఆర్ చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఎంపీలు అనుసరించనున్న వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయనే అంశం ఆసక్తికరంగా మారింది.
రేపు తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశం.. ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం - పార్లమెంటు శీతాకాల సమావేశాలు
19:05 November 27
రేపు తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశం.. ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం
ధాన్యం కొనుగోలు అంశం(Paddy procurement in telangana), వ్యవసాయ చట్టాల రద్దు(Farm Bill Repeal), విద్యుత్ సవరణ బిల్లు లాంటి అంశాలపై పార్లమెంట్ సమావేశాల్లో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలో ఎంపీలకు ముఖ్యమంత్రి సూచించనున్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు విషయంలో నెలకొన్న గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో పార్లమెంట్లో రైతుల తరఫున కేంద్రాన్ని నిలదీసేందుకు తెరాస, కాంగ్రెస్ నేతలు సన్నద్ధమవుతున్నారు.
నిన్న కేంద్ర మంత్రి ఇచ్చిన వివరణకు.. రాష్ట్ర నేతల వ్యాఖ్యలకు పొంతన కుదరక పోవటం వల్ల.. పార్లమెంట్ వేదికగానే స్పష్టత తెచ్చుకోవాలని గులాబీ ఎంపీలకు సీఎం సూచించనున్నట్టు సమాచారం. మరోవైపు ప్రతిపక్ష నేతలు సైతం.. రాష్ట్రం, కేంద్రం కుమ్మక్కై రైతులను అయోమయంలో పడేస్తున్న విషయాన్ని ఈ సమావేశాల్లోనే ప్రజలకు స్పష్టం చేయాలన్న యోచనలో వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇదీ చూడండి: