TENSION AT VIZAG AIRPORT: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం విమానాశ్రయం వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. విమానాశ్రయం వద్ద వైకాపా నేతల వాహనాలపై రాళ్ల దాడి జరిగింది. విశాఖలో జనవాణి కార్యక్రమంలో పాల్గొనేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. పవన్‌కు స్వాగతం పలికేందుకు జనసేన కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. అదే సమయంలో విశాఖ గర్జన కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్లేందుకు మంత్రి రోజా, పేర్ని నాని, వై.వి సుబ్బారెడ్డి తదితరులు విమానాశ్రయానికి చేరుకున్నారు.
వైకాపా నేతల కార్లపై దుండగుల రాళ్ల దాడి.. విశాఖలో హైటెన్షన్.. - కళావాణి స్టేడియం
TENSION AT VIZAG AIRPORT: ఏపీలోని విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విశాఖ గర్జనలో పాల్గొని తిరిగి వెళ్తున్న వైకాపా నేతల కార్లపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లదాడి చేశారు.
TENSION AT VIZAG AIRPORT
ఈ క్రమంలో గుర్తుతెలియని వ్యక్తులు కొందరు వైకాపా నేతల వాహనాలపై రాళ్లు, చెప్పులు విసిరారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితి అదుపు చేశారు. జనవాణి కార్యక్రమంలో భాగంగా పవన్ కల్యాణ్ 3 రోజుల పాటు ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. విశాఖ పోర్టు కళావాణి స్టేడియంలో రేపు జరిగే జనవాణి కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ఇవీ చదవండి: