రాష్ట్రంలో పెరుగుతున్న ఎండల తీవ్రత - there will be sun strokes in telangana
అంపన్ తుపాను ప్రభావం తెలంగాణపై లేదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో ఎండలు రోజురోజుకు పెరుగుతాయని తెలిపారు.
తెలంగాణలో పెరుగుతున్న ఎండల తీవ్రత
అంపన్ తుపాను ప్రభావం తెలంగాణపై లేదని వాతావరణ అధికారి రాజారావు తెలిపారు. రాష్ట్రంలో వేసవి ఎండల తీవ్రత మళ్లీ పెరుగుతోందన్నారు. ‘బుధవారం పలుచోట్ల 45డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా ఖమ్మం జిల్లాలోని బాణాపురంలో 45.1 డిగ్రీలుంది. శుక్రవారం నుంచి వడగాలులు వీచే అవకాశాలున్నాయని’ ఆయన తెలిపారు.