తెలంగాణ

telangana

ETV Bharat / city

Top News Today : టాప్​టెన్​ న్యూస్​ @1PM - తెలంగాణ వార్తలు

ఇప్పటివరకు ప్రధానవార్తలు

Top News Today, telangana news
టాప్​టెన్​ న్యూస్​

By

Published : Jan 9, 2022, 12:59 PM IST

  • ఫ్యామిలీ ఆత్మహత్య కేసులో కీలక ఆధారాలు

రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన విజయవాడలో తెలంగాణ వాసుల ఆత్మహత్య కేసులో కీలక ఆధారాలు లభించినట్లు సమాచారం. కుటుంబం ఆత్మహత్యకు ఫైనాన్స్ సంస్థల వేధింపులే కారణమని సూసైడ్ నోట్‌లో వెల్లడించినట్లుగా తెలుస్తోంది.

  • హైదరాబాద్​కు అసోం సీఎం..

అసోం ముఖ్యమంత్రి హిమంత్‌ బిశ్వ శర్మ హైదరాబాద్​ బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు భాజపా రాష్ట్ర నేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం వారు రోడ్డుమార్గంలో వరంగల్​కు బయలుదేరారు.

  • రేపు భాజపా మృత్యుంజయ హోమాలు

ప్రధాని మోదీ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని రేపు రాష్ట్ర వ్యాప్తంగా మృత్యుంజయ హోమాలు నిర్వహించనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఈ హోమాలు నిర్వహించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పిలుపునిచ్చారు.

  • గాడి తప్పిన తెలుగు అకాడమీ పాలన..

తెలుగు అకాడమీలో డిపాజిట్ల గల్లంతు వ్యవహారం వెలుగుచూసినప్పటి నుంచి.. ఆ సంస్థలో పాలన గాడి తప్పింది. ఓ వైపు విద్యా సంవత్సరం ప్రారంభమైనా ఉచిత పాఠ్య పుస్తకాలు అందక ఇంటర్​ విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. మరో వైపు సరైన సమయంలో వేతనాలు అందక శాశ్వత ఉద్యోగులు.. 2 నెలలుగా జీతాలు అందక పొరుగు సేవల ఉద్యోగులు ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నారు.

  • మాటువేసి మట్టుబెట్టారు!

జగిత్యాల జిల్లా ధరూర్​లో దారుణ హత్య జరిగింది. పాతకక్షలతో కొంతమంది.. ఓ యువకుడిని మాటువేసి మరీ హత్యచేశారు. గత కొన్నేళ్లుగా రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.

  • ముఖ్యమంత్రి నివాసంలో కొవిడ్ కలకలం..

ఝార్ఖండ్ సీఎం హేమంత్​ సోరెన్ ఇంట్లో కరోనా కలకలం రేపింది. హేమంత్ సోరెన్​ సతీమణి, ఇద్దరు పిల్లలకు కొవిడ్ నిర్ధరణ అయింది. సోరెన్ నివాసంలో మొత్తం 15 మందికి పరీక్షల్లో పాజిటివ్​గా తేలింది.

  • 'ప్రవాసుల విజయాలు మనకెంతో గర్వకారణం'

ప్రవాస భారతీయులు.. ప్రపంచవ్యాప్తంగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని కొనియాడారు ప్రధాని నరేంద్రమోదీ. అన్ని రంగాల్లోనూ ప్రవాస భారతీయులు రాణిస్తున్నారన్నారు. 17వ ప్రవాస భారతీయ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్వీట్​ చేశారు.

  • ప్రపంచవ్యాప్తంగా 22 లక్షల కరోనా కేసులు..

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్​ విజృంభణ కొనసాగుతోంది. కరోనా కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​ కారణంగా అమెరికా, ఐరోపా, ఆగ్నేయాసియా దేశాల్లో కొవిడ్​ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కఠిన చర్యలు అమలు చేయాలని, ఒమిక్రాన్​ను తేలికగా తీసుకొవద్దని హెచ్చరించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ).

  • కాన్వే అరుదైన రికార్డు..

న్యూజిలాండ్ బ్యాటర్ డేవిడ్ కాన్వే అరుదైన రికార్డు నెలకొల్పాడు. బంగ్లాదేశ్​తో జరుగుతున్న రెండో టెస్టులో అర్ధసెంచరీ బాదడం ద్వారా ఈ ఘనత సాధించాడు.

  • రమేశ్​బాబు భౌతికకాయానికి ప్రముఖుల నివాళులు..

అనారోగ్యంతో మరణించిన సూపర్​స్టార్ కృష్ణ తనయుడు రమేశ్​బాబు భౌతిక కాయానికి. ఆయన కుటుంబసభ్యులతో పాటు పలువురు నటులు హాజరై నివాళులర్పించారు.

ABOUT THE AUTHOR

...view details