తెలంగాణ

telangana

ETV Bharat / city

Top News Today : టాప్​న్యూస్​@ 7AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Top News Today, telangana news
తెలంగాణ వార్తలు

By

Published : Jan 5, 2022, 6:59 AM IST

  • హైకోర్టును ఆశ్రయించిన బండి సంజయ్​

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హైకోర్టును ఆశ్రయించారు. తన రిమాండ్​ను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. తనను వెంటనే విడుదల చేసేలా జైలు అధికారులకు ఆదేశాలివ్వాలని కోరారు.

  • పిల్లలపైనా ఒమిక్రాన్‌ ప్రభావం

పిల్లలపై ఒమిక్రాన్ పంజా విసురుతోంది. అమెరికాలోని బాధితుల్లో 22 శాతం మంది చిన్నారులే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. భారత్‌లోనూ అదే తీరులో అవకాశాలు ఉండనున్నాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. కొవిడ్‌ మనల్ని వదిలిపెట్టి పోయే పరిస్థితి లేదని... ఆరు నెలలకొకోసారి బూస్టర్‌ డోసు తీసుకోక తప్పదని చెబుతున్నఆపీ అధ్యక్షురాలు డాక్టర్‌ అనుపమతో ఈనాడు-ఈటీవీ భారత్ ముఖాముఖి.

  • గ్రీన్​ ఇండియా ఛాలెంజ్​లో గోరటి వెంకన్న, జూలూరి గౌరీశంకర్​

గ్రీన్​ ఇండియా ఛాలెంజ్​లో భాగంగా... కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత గోరటి వెంకన్న, తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్​ జూలూరి గౌరీశంకర్​ మొక్కలు నాటారు.

  • ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్ ప్రారంభం ఎప్పుడంటే?

హైదరాబాద్ సింగరేణి భవన్‌లో సింగరేణి థర్మల్, సోలార్‌ ప్లాంట్ల పనితీరుపై సీఎండీ శ్రీధర్‌ ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. మెరుగైన ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టర్​తో 2021-22లో సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం మొదటి స్థానంలో నిలవడంపై

  • రతన్‌జీకి ప్రవేశం లేదంటే..

ముంబయి అనగానే... గుర్తొచ్చే వాటిలో ఒకటి తాజ్‌ హోటల్‌! దేశవిదేశాల్లో పేరు సంపాదించిన తాజ్‌ హోటల్‌ బ్రాండ్‌ వెనక... ఆంగ్లేయుల అవమానం... భారతీయ సంస్కారం దాగున్నాయి.

  • పంజాబ్​కు ప్రధాని మోదీ

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పంజాబ్​లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. రెండేళ్ల తర్వాత పంజాబ్‌లో కాలు మోపనున్న మోదీ.. సరిహద్దు జిల్లా పిరోజ్​పుర్​ను సందర్శిస్తారు. ఈనేపథ్యంలో భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. 10 వేల మంది సిబ్బంది సహా యాంటీ డ్రోన్​ బృందాన్ని కూడా మోహరించారు.

  • ఆ రాష్ట్రంలో వారాంతపు కర్ఫ్యూ..

కొవిడ్​ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వారాంతపు కర్ఫ్యూ విధిస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. రాత్రి కర్ఫ్యూ మరో రెండు వారాలు పొడిగించింది. మరోవైపు అత్యవసర విభాగాల్లో పని చేసే అధికారులు, జడ్జీలు, కోర్టు సిబ్బంది సహా ఇంకొందరికి వారాతంపు, రాత్రి కర్ఫ్యూల నుంచి మినహాయిస్తూ దిల్లీ సర్కారు నిర్ణయం తీసుకుంది.

  • రిలయన్స్​ జియో బాండ్లు విక్రయం?

రిలయన్స్​ జియో మరోమారు బాండ్ల విక్రయాలు జరిపే అవకాశాలు ఉన్నాయి. ఈసారి రూ.5000 కోట్ల విలువైన రూపీ బాండ్లను విక్రయించనుంది ఓ ఆంగ్లపత్రికలో కథనం వెలువడింది.

  • జకోవిచ్​పై వీడిన ఉత్కంఠ

ఈ నెల 17న ప్రారంభంకానున్న ఆస్ట్రేలియన్​ ఓపెన్​లో జకోవిచ్​ ఆడతాడా? లేదా? అన్న సందిగ్ధతకు తెరపడింది. 'మినహాయింపు అనుమతి' లభించడం వల్ల కరోనా టీకా వేసుకోకుండానే ఈ మెగాటోర్నీలో పాల్గొంటున్నట్లు అతడు తెలిపాడు.

  • ప్రభాస్ పోలీసు రోల్..

ప్రభాస్​-సందీప్​రెడ్డి వంగా సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఇందులో డార్లింగ్ హీరో పోలీస్​గా కనిపించనున్నారని నిర్మాత క్లారిటీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details