తెలంగాణ

telangana

ETV Bharat / city

TOP NEWS TODAY : టాప్​న్యూస్​@ 11AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP NEWS TODAY,  telangana news
టాప్​న్యూస్

By

Published : Jan 4, 2022, 10:54 AM IST

  • నిర్లక్ష్యానికి తప్పదు.. భారీ మూల్యం!

హైదరాబాద్​లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. అయితే లక్షణాలు మాత్రం అంత తీవ్రంగా లేవు. కానీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. నిర్లక్ష్యం చేస్తే... భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

  • దేశంలో కరోనా కేసులు

దేశంలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. సోమవారం ఒక్కరోజే 37,379 కేసులు నమోదయ్యాయి. కొవిడ్​తో 124 మంది ప్రాణాలు కోల్పోయారు. 11,007 మంది కొత్తగా కోలుకున్నారు. దేశంలో రోజువారీ కొవిడ్​ పాజిటివిటీ రేటు 3.24 శాతంగా ఉంది.

  • ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య

తనకు ఇష్టం లేని చదువును బలవంతంగా చదవలేనని ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా సుభాష్ నగర్​లో జరిగింది.

  • నియోజకవర్గ అభివృద్ధి నిధులు

శాసనసభ కోటాలో ఇటీవల ఎన్నికైన ఆరుగులు ఎమ్మెల్సీలకు నియోజకవర్గ అభివృద్ధి నిధులు మంజూరయ్యాయి. వారిలో ఐదుగురికి జిల్లాలను కేటాయిస్తూ నిధులు మంజూరు చేస్తూ ప్రణాళిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

  • జీహెచ్​ఎంసీకి ఐదేళ్లలో రూ.418కోట్లు ఆదా..

ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌లో భాగంగా ఎల్​ఈడీ దీపాలతో గడిచిన ఐదేళ్లుగా రూ.418 కోట్ల నిధులు ఆదా అయినట్లు జీహెచ్​ఎంసీ తెలిపింది. విద్యుద్దీపాల విషయంలో చేస్తోన్న ఖర్చులు కూడా గణనీయంగా తగ్గాయని వివరించింది.

  • పోలీసులు పట్టుకోగానే తగులబెట్టేశాడు

తాగి వాహనం నడపిన ఓ వ్యక్తిని డ్రంక్ అండ్ డ్రైవ్​ తనిఖీల్లో భాగంగా పోలీసులు పట్టుకున్నారు. అతని వాహనాన్ని సీజ్ చేస్తామని చెప్పారు. బైక్​ను సీజ్ చేస్తామనగానే.. ఆ వ్యక్తి పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. అంతేగాక వాహనాన్ని తగులబెట్టాడు. ఈ ఘటన హైదరాబాద్​ నాంపల్లిలో చోటుచేసుకుంది.

  • కరోనా ముగింపు దశ ఎలా ఉంటుంది?

కరోనా వైరస్‌ను పూర్తిగా నిర్మూలించడం సాధ్యం కాదని, అది ఎప్పటికీ జనబాహుళ్యంలోనే ఉంటుందని, దానితో కలిసి మనుగడ సాగించడాన్ని ప్రపంచం నేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే.. ఏదో ఒక దశలో చెప్పుకోదగ్గ సంఖ్యలో దేశాలు.. కొవిడ్‌ కేసులను గణనీయ స్థాయిలో తగ్గించుకోగలిగితే మహమ్మారి (ప్యాండెమిక్‌)కి అధికారికంగా ముగింపు పడిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటిస్తుంది.

  • ఒక్కరోజే 10 లక్షల కేసులు

అగ్రరాజ్యంలో కరోనా మహమ్మారి రాకెట్​ వేగంతో దూసుకెళుతోంది. సోమవారం ఒక్కరోజే 10లక్షలు కేసులు నమోదయ్యాయి. వైరస్​ బారినపడి ఆసుపత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతోంది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో లక్షకుపైగా చికిత్స పొందుతున్నారు.

  • గావస్కర్ కీలక వ్యాఖ్యలు

జోహన్నెస్​బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా సీనియర్ బ్యాటర్లు పుజారా, రహానే మరోసారి విఫలమయ్యారు. ఒలీవర్‌ వేసిన ఇన్నింగ్స్‌ 24వ ఓవర్‌లో పుజారా (3), రహానె (0) వరుస బంతుల్లో ఔటయ్యారు. ఈ క్రమంలోనే వీరి ఫామ్​పై స్పందించాడు మాజీ బ్యాటర్ సునీల్ గావస్కర్.

  • 'రాధేశ్యామ్​' కళ్లు చెదిరే ఆఫర్!​

ప్రభాస్​ నటించిన 'రాధేశ్యామ్'​ డిజిటల్​ రిలీజ్​ కోసం ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ ఆఫర్​ను ప్రకటించినట్లు తెలుస్తోంది. అయితే చిత్రబృందం మాత్రం థియేటర్లలో సినిమా విడుదల చేసేందుకే మొగ్గు చూపుతోందట.

ABOUT THE AUTHOR

...view details