తెలంగాణ

telangana

ETV Bharat / city

పార్లమెంటరీ లైబ్రరీ కమిటీ ఛైర్మన్​గా నామ నాగేశ్వరరావు - nama nageshwara rao

ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావును పార్లమెంట్​ లైబ్రరీ కమిటీ ఛైర్మన్​గా నియమిస్తూ లోక్​సభ స్పీకర్​ ఓంబిర్లా ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా దేశంలో చట్టసభల కంప్యూటరీకరణ కోసం కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో తెలుగు రాష్ట్రాల స్పీకర్లకు చోటు లభించింది.

పార్లమెంటరీ లైబ్రరీ కమిటీ ఛైర్మన్​గా నామ నాగేశ్వరరావు

By

Published : Oct 9, 2019, 10:26 PM IST

Updated : Oct 9, 2019, 11:54 PM IST

దేశవ్యాప్తంగా చట్టసభల కంప్యూటరీకరణ కోసం లోక్​సభ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటైంది. లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా నేతృత్వంలో 7 రాష్ట్రాల స్పీకర్లను ఈ కమిటీలో సభ్యులుగా నియమించారు. వీరిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ స్పీకర్లు పోచారం శ్రీనివాసరెడ్డి,తమ్మినేని సీతారాం ఉన్నారు. చట్టసభల పనితీరు, సభ్యులకు అందించే సేవలపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది.

పలు కమిటీలకు ఛైర్మన్లు, సభ్యుల నియామకం

లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా.. పలు కమిటీలకు ఛైర్మన్లు, సభ్యులను నియమించారు. ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావును పార్లమెంట్‌ లైబ్రరీ కమిటీ ఛైర్మన్‌గా ప్రకటించారు.
లోక్‌సభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ ఛైర్మన్‌ పదవి ఏపీ, నర్సాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజును వరించింది.

ఇవీ చూడండి: "రేపటినుంచి పూర్తిస్థాయిలో బస్సులు నడిపేందుకు చర్యలు"

Last Updated : Oct 9, 2019, 11:54 PM IST

ABOUT THE AUTHOR

...view details