Singareni Workers Samme : గనుల వేలాన్ని నిరసిస్తూ సింగరేణి కార్మికులు చేపట్టిన సమ్మె రెండో రోజు కొనసాగుతోంది. కార్మికులు స్వచ్ఛందంగా ఇంట్లోనే ఉండి సమ్మెకు మద్దతిస్తున్నారు. అత్యవసర పనులు నిర్వహించే కార్మికులు తప్ప మిగతా కార్మికులు విధులకు దూరంగా ఉన్నారు. దీనివల్ల నాలుగు లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. కార్మికుల వేతనాల రూపంలో సుమారు రూ.40 కోట్ల నష్టం వాటిల్లినట్లు చెప్పారు. కాంట్రాక్ట్ కార్మికులు కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నారు.
మంచిర్యాలలో సింగరేణి కార్మికుల సమ్మె..
Singareni Samme Second Day: మంచిర్యాల జిల్లాలో రెండో రోజు సింగరేణి కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ప్రధాన సంఘాలకు విప్లవ సంఘాలు సంపూర్ణ మద్దతు తెలిపాయి. కార్మికుల సమ్మెతో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది.
మరోసారి చర్చలు
Singareni Labor Samme Today: కార్మిక సంఘాల నాయకులు 12 డిమాండ్లను యాజమాన్యం ముందుంచగా.. ఆర్ఎల్సీ సమక్షంలో కార్మిక సంఘాల జేఏసీ, యాజమాన్యం మధ్య చర్చలు విఫలమయ్యాయి. ఆర్ఎల్సీ చర్చలకు మరోసారి ఆహ్వానించింది. దేశంలోని 88 బొగ్గు బ్లాక్‌లను ప్రైవేట్ పరం చేయడానికి కేంద్ర సిద్ధమైందని.. అందులో 4 సింగరేణి బ్లాక్లున్నాయని టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి వాపోయారు. ప్రధాని మోదీ.. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్నారని మండిపడ్డారు.
ఆందోళన ఉద్ధృతం
Singareni Samme in Mancherial: కేంద్ర పభుత్వం బొగ్గు బ్లాక్‌ల ప్రైవేటీకరణను ఉపసంహరించకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని సింగరేణి కార్మికులు హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులతో దోబూచులాడుతున్నాయని మిగిత కార్మిక సంఘాలు ఆరోపించాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖలు రాయడం కాదు.. స్వయంగా ప్రధాని మోదీని కలిసి బొగ్గు గనులను సింగరేణికి చెందేలా చూడాలని డిమాండ్ చేశారు.