Electricity Charges Hike Telangana : ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలోనే కరెంటు ఛార్జీలు చాలా తక్కువగా ఉన్నాయని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. అందువల్లే ప్రభుత్వం రాయితీ నిధులు పెంచి ఇచ్చినా విద్యుత్ సంస్థలకు నష్టాలు తప్పడం లేదని ఆయన వివరించారు. ఈ సంస్థల ఆర్థిక పరిస్థితిపై వరసగా మూడోరోజు బుధవారం ఆయన ఉన్నతాధికారులతో సుదీర్ఘ సమీక్ష జరిపారు. ట్రాన్స్‌కో-జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు, దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం) సీఎండీ రఘుమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు మంత్రి హరీశ్‌రావును సైతం అధికారులు కలసి కరెంటు ఛార్జీల పెంపు ప్రతిపాదనలను వివరించారు. సమీక్షలో మంత్రి జగదీశ్‌రెడ్డికీ వివరించారు.
Electricity Charges Hike Telangana : 'కరెంటు బిల్లు పెంచకపోతే నష్టాలు తప్పవు' - తెలంగాణలో కరెంటు ఛార్జీల పెంపు
Electricity Charges Hike Telangana : రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు యూనిట్‌కు సగటున రూపాయి వరకైనా పెంచకపోతే నష్టాలు తప్పవని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యుత్ సంస్థల ఉన్నతాధికారులతో మూడో రోజు సమీక్ష జరిపారు. నష్టాలతో నడుస్తున్న సంస్థలను గట్టెక్కించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని అధికారులను ఆదేశించారు.
Electricity Charges Increase in Telangana : యూనిట్‌కు సగటున రూపాయి వరకైనా పెంచకపోతే విద్యుత్ సంస్థలకు ఆదాయం పెరగదని, నష్టాలు తీరవని వారు పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ సమీక్షలో జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ ‘‘200 యూనిట్లలోపు వినియోగించేవారి నుంచి తక్కువ ఛార్జీలు వసూలు వల్ల ప్రభుత్వం రూ.1253 కోట్లను రాయితీగా ఏటా చెల్లిస్తోంది. రాయితీలన్నీ కలిపి ఏటా రూ.10,000 కోట్లు ఇస్తోంది. భాజపా, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల పాలిత రాష్ట్రాలలో రైతులు నెలకు రూ.2,500 పైనే కరెంటు బిల్లులు చెల్లిస్తున్నారు. నష్టాలతో నడుస్తున్న సంస్థలను గట్టెక్కించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలి’’ అని మంత్రి జగదీశ్‌రెడ్డి ఉన్నతాధికారులకు సూచించారు.
ఇవీ చదవండి :