రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు : వాతావరణ శాఖ - heavy rain in telangana
రాష్ట్రంలో నేడు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురియనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. బంగాళఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనంతో తెలుగు రాష్ట్రాలతో నేడు, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు.
రాష్ట్రంలో రాగల మూడురోజుల పాటు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈరోజు, రేపు ఒకటి రెండుచోట్ల భారీవర్షాలతో పాటు.. ఎల్లుండి భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సుమారుగా సెప్టెంబరు 13న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ప్రకటించింది. అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పెరగనున్నట్లు పేర్కొన్నారు.