తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @3PM - తెలంగాణ ప్రధాన వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​ టెన్​ న్యూస్​ @1PM
టాప్​ టెన్​ న్యూస్​ @1PM

By

Published : Jan 7, 2022, 2:58 PM IST

  • తెరాస నుంచి వనమా రాఘవ సస్పెన్షన్

Vanama Raghava Suspended: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వనమా రాఘవను తెరాస అధిష్ఠానం సస్పెండ్​ చేసింది. కేసీఆర్​ ఆదేశాలతో పార్టీ నుంచి సస్పెండ్​ చేస్తున్నట్లు తెలిపింది. రాఘవపై సస్పెన్షన్​.. తక్షణమే అమల్లోకి వస్తుందని ఈ మేరకు ప్రకటించింది.

  • 'కరీంనగర్ సీపీ జనరల్ డయ్యర్​ను తలపించారు'

Tarun Chugh on Karimnagar CP : భాజపా కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలపై జరిగిన దాడి జలియన్​ వాలాబాగ్​ ఘటనను తలపించిందని భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. ఆ ఘటనలో ఎంతో మంది నేతలు, కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎంపీకే రక్షణ లేదని.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. మరోవైపు.. భాజపా నాయకులకు కేసులు కొత్త కాదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.

  • 'త్వరలో ఎంపీ పదవికి రాజీనామా చేస్తా'

RRR Latest Pressmeet: తనపై అనర్హత వేటు వేయకపోతే తానే రాజీనామా చేస్తానని వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు తెలిపారు. తాను రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్తానని.. వైకాపాపై ఎంత వ్యతిరేకత ఉందో ఎన్నికల ద్వారా తెలియజేస్తానన్నారు.

  • '150 కోట్ల టీకాలు పంపిణీ.. ఆత్మనిర్భర భారత్​కు నిదర్శనమిదే'

PM Modi On Vaccination: శుక్రవారం దేశవ్యాప్తంగా 150కోట్ల వ్యాక్సిన్​ డోసుల పంపిణీ పూర్తయిందన్నారు ప్రధాని నరేంద్రమోదీ. పేదలకు వైద్యపరమైన ప్రయోజనాలను అందించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. కోల్​కతాలోని చిత్తరంజన్ నేషనల్ కేన్సర్​ ఇన్స్​స్టిట్యూట్​ రెండో క్యాపస్​ను వర్చువల్​ విధానంలో ప్రారంభించిన సందర్భంగా ఈ విషయాలు వెల్లడించారు మోదీ.

  • వైభవంగా అధ్యయనోత్సవాలు

Bhadradri Adhyanotsavalu: భద్రాద్రిలో ముక్కోటి ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు శ్రీరామచంద్రమూర్తి వామనావతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. కరోనా నిబంధనల నడుమ నిత్య కల్యాణ మండపం వద్దనే భక్తులకు స్వామి వారి దర్శనం ఏర్పాట్లు చేశారు.

  • ఫోన్​ తెచ్చిందని దుస్తులు విప్పించి.. నేలపై కూర్చోబెట్టారు..

పాఠశాలకు సెల్​ఫోన్​ తీసుకొచ్చిందనే కారణంతో ఎనిమిదో తరగతి విద్యార్థిని దుస్తులు విప్పించి, తీవ్రంగా కొట్టింది ప్రధానోపాధ్యాయురాలు. తోటి విద్యార్థుల ముందు బట్టలు లేకుండా సాయంత్రం వరకు కూర్చోబెట్టింది. ఈ అమానవీయ సంఘటన కర్ణాటకలోని మాండ్యాలో జరిగింది.

  • 'వరల్డ్ వార్ 2' సమయంలో తల్లికి ఉత్తరం.. 76ఏళ్ల తర్వాత డెలివరీ

World War 2 Letter Delivery: ఎప్పుడో 76 ఏళ్ల క్రితం రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఓ సైనికుడు.. తన తల్లికి పంపించిన ఉత్తరం ఇప్పటికి డెలివరీ అయింది. అదేంటి? లెటర్ డెలివరీ చేయడానికి ఇన్నేళ్లు పట్టిందా? అని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఈ స్టోరీ చదివేయండి మరి.

  • స్టంప్స్​కు బంతి ముద్దిచ్చింది.. స్టోక్స్ బతికిపోయాడు!

Stokes Ashes: ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో యాషెస్ టెస్టులో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. దీంతో ఇంగ్లీష్ బ్యాటర్ బెన్ స్టోక్స్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అసలేం జరిగిందంటే!

  • సినిమా సంగతులు

Cinema news: సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో 'పుష్ప', 'మేజర్​' సాంగ్స్​తో పాటు కిరణ్​ అబ్బవరం కొత్త చిత్రానికి సంబంధించిన సంగతులు ఉన్నాయి.

  • తమన్​కు కొవిడ్ పాజిటివ్

Thaman covid: 'భీమ్లా నాయక్', 'సర్కారు వారి పాట' లాంటి సినిమాలతో బిజీగా ఉన్న ప్రముఖ సంగీత దర్శకుడు తమన్​కు కొవిడ్ పాజిటివ్​గా తేలింది.

ABOUT THE AUTHOR

...view details