ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలుCCTV Footage: మితిమీరిన పోకిరీల ఆగడాలు Alvin Colony CCTV Footage: హైదరాబాద్ జగద్గిరి గుట్ట పీఎస్ పరిధిలో అర్ధరాత్రి పోకిరీల ఆగడాలు మితిమీరిపోయాయి. కొత్త సంవత్సరం జోష్‌లో పూటుగా మద్యం సేవించిన కొందరు యువకులు.. వీధుల్లో వీరంగం సృష్టించారు. కార్లు, ఆటోల అద్దాలను ధ్వంసం చేయడంతో పాటు బైక్‌పై వెళ్తున్న వారిని వెంబడించి హల్చల్ చేశారు.ముగ్గురిని బలిగొన్న ప్రమాదాలు Road accidents today: రాష్ట్రంలో ఇవాళ పలు చోట్ల రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వేర్వేరు జిల్లాల్లో జరిగిన ప్రమాదాల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పలువురికి గాయాలయ్యాయి.అమ్మకే అమ్మ అయిన ఏడేళ్ల చిన్నారి Daughter taking care mother: అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లికి ఓ చిన్నారి తల్లిలా మారింది. ఆస్పత్రిలో ఉన్న ఆమెకు ఆ చిన్నారి అన్నీ తానే సేవలు చేస్తోంది. మరోవైపు... తన తమ్ముడి బాగోగులను చూసుకుంటోంది. ఇంతటి బాధ్యతల మధ్యే పాఠశాలకు వెళ్లి చదువుకుంటోంది.బిల్లు అడిగారని లిక్కర్ పారబోసి నిరసన.. వీడియో వైరల్Foreigner With Liquor Bottles: మద్యం సీసాలతో వెళ్తున్న ఓ విదేశీయుడిని పోలీసులు అడ్డగించి.. బాటిళ్లకు సంబంధించిన రసీదు చూపించాలని కోరారు. రసీదులు లేకపోవటం వల్ల మందును రోడ్డు పక్కన పారబోసి నిరసన తెలిపాడు. ఈ సంఘటన కేరళ కోవాలంలో జరిగింది.పది రూపాయల కోడిపిల్లకు రూ.50 టికెట్ Ticket for baby chick: కోడిపిల్ల ఓ కుటుంబానికి పెద్ద నష్టమే తెచ్చిపెట్టింది. రూ.10కి దాన్ని ఆ కుటుంబం కొనుగోలు చేసి బస్సు ఎక్కింది. అయితే.. బస్సు కండక్టర్ దానికి రూ.50 టికెట్ వేశాడు. ఇది ఎక్కడ జరిగిందంటే..?దారుణ హత్యRowdy sheeter murder at tadepalligudem: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో ఓ రౌడీషీటర్, అతని అనుచరుడు దారుణ హత్యకు గురయ్యారు. శనివారం రాత్రి పాత పైవంతెన కింద ఉన్న శ్రీనివాస లాడ్జి వద్దకు వెళ్లగా.. గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి వారిపై దాడి చేసి, కత్తులతో విచక్షణారహితంగా పొడిచి పరారయ్యారు.ఆ ఫైనాన్షియర్ 'వలపు వల'లో ఇద్దరు మాజీ అధ్యక్షులు!Jeffrey Epstein Trafficking: అమెరికాలో అతిపెద్ద సెక్స్ కుంభకోణానికి పాల్పడ్డాడో ఓ వ్యక్తి. అగ్రరాజ్యంలో అతిపెద్ద ఫైనాన్షియర్ అయిన ఆ వ్యక్తి తన పరపతి పెంచుకోవడం కోసం ఏళ్ల తరబడి పెద్ద తలలకు టీనేజ్ అమ్మాయిలను ఎరగా వేశాడు. ఎంతో మంది బిగ్ షాట్స్ ఈ కుంభకోణంలో బలయ్యారు. వారిలో ఇద్దరు అమెరికా మాజీ అధ్యక్షులు కూడా ఉండడం గమనార్హం.ఆ దేశ పార్లమెంట్లో అగ్నిప్రమాదంSouth Africa Parliament fire accident: దక్షిణాఫ్రికా పార్లమెంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు.'పుజారా ఇలానే ఆడితే కష్టమే'Pujara Performance: పరుగులు చేయలేక ఇబ్బంది పడుతున్న పుజారా ఫామ్‌లోకి రావాలని, లేకపోతే జట్టులో చోటు కోల్పోయే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు మాజీ సెలక్టర్ శరణ్‌దీప్ సింగ్. పూర్ ఫామ్‌ను కొనసాగిస్తే అతడి స్థానంలోకి శ్రేయస్ అయ్యర్ లాంటి యువ ఆటగాళ్లు వచ్చే అవకాశముందని అన్నాడు.బాలీవుడ్లో బన్నీ ధమాకా.. కళ్లు చెదిరేలా 'పుష్ప' వసూళ్లుPushpa hindi collection: ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్ల వసూళ్లను అందుకున్న 'పుష్ప'.. బాలీవుడ్లో రూ.75 కోట్ల మార్క్ వైపు దూసుకుపోతుంది. మూడోవారంలోనూ కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది.