ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు...నా దగ్గర కేంద్రం అవినీతి చిట్టా.. కేంద్రంపై అందరం కలిసి పోరాటం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి పిలుపునిచ్చారు. ఆకలి రాజ్యాల జాబితాలో భారత్ 101వ స్థానంలో ఉందని పేర్కొన్నారు. మోదీ పాలనలో దేశాన్ని ఆకలిరాజ్యంగా మార్చారని ఆరోపించారు. యాదాద్రి జిల్లా పర్యటనలో భాగంగా.. కలెక్టరేట్, తెరాస పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం రాయగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు.ఏపీకి ప్రత్యేక హోదా అంశం తొలగింపు..ఈ నెల 17న జరిగే తెలుగు రాష్ట్రాల భేటీ అజెండాలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్ర హోంశాఖ తొలగించింది. అజెండాలో మార్పు చేస్తూ కేంద్ర హోంశాఖ మరో సర్క్యులర్ ఇచ్చింది.పాఠశాలలు త్వరలోనే సంపూర్ణ రూపాంతరం.. Mana Ooru Mana Badi: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు - మన బడి కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఎన్నారైలు భాగస్వాములు కావాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. దేశవిదేశాల్లో స్థిరపడిన ఎన్నారైలతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మంత్రి కేటీఆర్ వర్చువల్ సమావేశం నిర్వహించారు.రాందేవ్ బాబాకు ఆ హక్కే లేదు..CPM Leaders Comments: ముచ్చింతల్‌లోని సమతామూర్తిని వామపక్షనేతలు సందర్శించాలని రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలపై సీపీఎం నేతలు స్పందించారు. రాందేవ్‌బాబా మొదట.. దళిత, గిరిజన వాడలను సందర్శించిన తర్వాత సమానత్వం గురించి మాట్లాడాలని సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు హితవు పలికారు.మూడు రాజధానులు పెడితే ఎక్కడికి రావాలి.. Athavale comments on AP capital: ఏపీలో మూడు చోట్ల రాజధానులు పెడితే ఎక్కడకు రావాలని కేంద్రమంత్రి అఠావలే వైకాపాను ఉద్దేశించి ప్రశ్నించారు. ప్రస్తుతం ఒక్క రాజధాని కూడా అభివృద్ధి కావడం లేదని ఎద్దేవా చేశారు. రాజధాని నిధులను గతంలో యూపీఏ సర్కారు విస్మరించిందని.. కానీ మోదీ ప్రభుత్వం పరిశీలిస్తోందని పేర్కొన్నారు.'అద్దెకు బాయ్‌ఫ్రెండ్'.. ఎక్కడో తెలుసా..Boy Friend On Rent Bihar: 'అద్దెకు బాయ్‌ఫ్రెండ్' బిహార్‌లోని దర్భంగాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ ప్లకార్డులతో ఓ యువకుడు దర్శనమిస్తున్నాడు. నగరంలోని ప్రతి ప్రాంతంలో ఈ ప్లకార్డును ప్రదర్శిస్తూ తిరుగుతున్నాడు. మరి ఆ యువకుడు ఎవరు? అతడు ఎందుకు అలా చేస్తున్నాడు..?కశ్మీర్లో ఉగ్ర కుట్ర భగ్నం.. Terror Module Busted: జమ్ముకశ్మీర్‌లో ఉగ్ర కుట్రను భగ్నం చేశారు పోలీసులు. నిషేధిత ఉగ్రవాద సంస్థ ఆల్ బదర్కు చెందిన నలుగురు ఉగ్రవాదులతో సహా మొత్తం ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి భారీ స్థాయిలో మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు.'ఎట్నా' విస్పోటనం.. ఎగిసిపడుతున్న లావా..Volcano Eruption: ఇటలీలోని ఎట్నా అగ్ని పర్వతం విస్ఫోటనం చెందింది. ఆకాశాన్ని తాకేంతగా అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. బిలం నుంచి పెద్దఎత్తున లావా ఉబికి వస్తూ దిగువకు జారుతోంది. ఎర్రటి జ్వాలలు భయంగొల్పే రీతిలో కనిపిస్తున్నాయి. దాదాపు 10 కిలోమీటర్ల మేర బూడిద పొగలు వ్యాపించాయి.రేటు మారినా మళ్లీ సొంతగూటికే.. IPL 2022 Mega auction: ఐపీఎల్ మెగా వేలంలో భాగంగా పలు ఫ్రాంఛైజీలు తమ పాత ఆటగాళ్లను తిరిగి కొనుగోలు చేశాయి. వీరిలో కొందరి ధర సగానికిపైగా పడిపోగా మరి కొందరి ప్లేయర్ల ధర బాగా పెరిగింది. ఇంతకీ ఆ ఆటగాళ్లు ఎవరో తెలుసుకుందాం..అనసూయ లేటెస్ట్ హాట్ వీడియో..Anasuya Latest Video: సినీనటి, వ్యాఖ్యాత అనసూయ తాజాగా తనకు సంబంధించిన ఓ హాట్ వీడియోను పోస్ట్ చేసింది. ఇది నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కాగా, హీరోలు సూర్య, సుధీర్‌బాబు నటిస్తున్న కొత్త చిత్రాలకు సంబంధించిన అప్డేట్స్ వచ్చాయి.