ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు...దిల్లీ కోట బద్దలు కొట్టేందుకు సిద్ధం.. దిల్లీ కోట బద్దలు కొట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడ్డామని.. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో 30 లక్షల బోర్లు వేసుకున్నట్లు స్పష్టం చేశారు. కానీ కేంద్రం అడ్డగోలుగా డీజిల్, ఎరువుల ధరలు పెంచి రైతులను ఆగం చేసిందని ఆరోపించారు.జనగామకు సీఎం కేసీఆర్ వరాలు..CM KCR Jangaon Tour Speech: జనగామ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించారు. జిల్లాలోని యశ్వంతపూర్ వద్ద తెరాస కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్... అనంతరం తెరాస బహిరంగ సభకు హాజరయ్యారు. సభలో ప్రసగించిన సీఎం.. జనగామ జిల్లాకు కొన్ని వరాలు కురిపించారు.పదో తరగతి పరీక్షల షెడ్యూల్.. పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మే 11 నుంచి 17 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్టు సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు శుక్రవారం ప్రకటించింది. అలాగే, మే 18 నుంచి 20 వరకు ఓఎస్ఎస్సీ, ఒకేషనల్ విద్యార్థులకు పరీక్షలు ఉంటాయని తెలిపింది. ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభమై మధ్యాహ్నం 12.45గంటల వరకు కొనసాగుతుందని తెలిపింది.దేశంలో అమృతకాలం.. ఆ రాష్ట్రాల్లో రాహుకాలం..Nirmala Sitharaman On Congress: దేశంలో అమృతకాలం కొనసాగుతుండగా.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మాత్రం రాహుకాలం ఉందన్నారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. 2014 నుంచి దేశంలో రాహుకాలం కొనసాగుతోందన్న కాంగ్రెస్ ఎంపీ కపిల్ సిబల్ వ్యాఖ్యలపై రాజ్యసభలో ఈమేరకు స్పందించారు నిర్మలా.యూపీలో సంకీర్ణం తప్పదా..? UP phase-1 assembly polls: ఉత్తర్‌ప్రదేశ్ తొలి దశ ఎన్నికల్లో విజయం మాదేనంటూ అన్ని పక్షాలు ప్రకటించుకుంటున్నాయి. భాజపా జెండా అందనంత ఎత్తులో ఎగురుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. మరోవైపు, ఫలితాలు రాకముందే రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు విషయం స్పష్టమైందని సమాజ్‌వాదీ అధినేత చెప్పుకొచ్చారు.జూ పార్కులో అరుదైన కోతులు అపహరణ..Rare Squirrel Monkey Stolen: చెన్నైలోని వాండలూర్ అన్నా జూ పార్క్‌లో రెండు అరుదైన స్క్విరెల్ కోతులను ఎత్తుకెళ్లారు దుండగులు. వీటికి ప్రపంచ మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.యువకుడి కిరాతకం.. ప్రేయసిపై కత్తితో దాడి.. Karnataka woman stabbed: వారిద్దరూ ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారు.. ఇద్దరి కుటుంబాలు ఇందుకు అంగీకారం తెలిపాయి.. అంతా సాఫీగా జరుగుతున్న సమయంలోనే ప్రేమికుడు.. తన ప్రేయసిపై దారుణానికి పాల్పడ్డాడు. కత్తితో పొడిచి యువతిని తీవ్రంగా గాయపరిచాడు. అసలు ఎందుకిలా చేశాడంటే?ఎన్సీబీ.. బదిలీ చేసుకోవాలా..?Vehicle Insurance: వాహనానికి ఆర్థిక భద్రత కల్పించేది సమగ్ర మోటార్ బీమా పాలసీ. వాహనం ఏదైనా ప్రమాదానికి కారణమైనప్పుడు.. ఇతరులకు కలిగే నష్టానికీ పరిహారం అందిస్తుంది. వాహనానికీ (ఓన్ డ్యామేజీ), ఇతరులకూ నష్టం వాటిల్లినప్పుడు (థర్డ్ పార్టీ) ఈ సమగ్ర మోటార్ బీమా పాలసీ దానికి పరిహారాన్ని చెల్లిస్తుంది.మెగా వేలానికి సర్వం సిద్ధం.. IPL 2022: ఈ సారి ఐపీఎల్ మెగావేలంలో 590మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారు. కొత్తగా చేరిన రెండు ప్రాంఛైజీలతో కలిపి మొత్తం 10 జట్లు తమకు నచ్చిన ప్లేయర్ల కోసం రూ.కోట్లు కుమ్మరిచేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి ఏ ప్రాంఛైజీల వ్యూహం ఎలా ఉండబోతోంది? ఏ ఆటగాడిపై కాసుల వర్షం కురిసే అవకాశం ఉంది? విదేశీ ఆటగాళ్లలో ఎవరికి భారీ డిమాండ్ ఉండబోతోంది?కొత్త సినిమాల ముచ్చట్లు..Cinema updates: మెగాహీరో వరుణ్‌తేజ్ 'గని' సినిమా సెన్సార్ పనులను పూర్తిచేసుకుని యూ/ఏ సర్టిఫికేట్‌ను దక్కించుకుంది. కాగా, నాగార్జున, నాగచైతన్య నటించిన చిత్రం 'బంగార్రాజు' ఓటీటీ ట్రైలర్ విడుదలైంది.