ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు...ఐదు రాష్ట్రాల్లో మాదే విజయం.. PM Modi Interview ANI: శాసనసభ ఎన్నికలు జరుగుతున్న అన్ని రాష్ట్రాల్లోనూ భాజపా విజయం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. సంపూర్ణ మెజారిటీతో ఐదు రాష్ట్రాల్లోనూ అధికారం చేపడతామని ఏఎన్ఐ ముఖాముఖిలో ధీమాగా చెప్పారు.ట్రెండింగ్‌లో 'మోదీ ఎనిమీ ఆఫ్ తెలంగాణ'..Modi Enemy Of Telangana: పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై తీవ్రదుమారం రేగుతోంది. రాష్ట్రంలో తెరాస, కాంగ్రెస్‌లు తీవ్రస్థాయిలో నిరసన వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తెరాస మోదీ ఎనిమీ ఆఫ్ తెలంగాణ అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్విట్టర్లో ట్రెండ్ చేసింది.మోదీ క్షమాపణలు చెప్పాల్సిందే.. KTR Comments: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి కేటీఆర్.. ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గుజరాత్ కంటే అభివృద్ధి చెందుతున్నామని మోదీకి కడుపుమంటగా ఉందని తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.ప్రధాని వ్యాఖ్యలపై తెరాస నిరసనల హోరు..TRS Protest against PM Comments :పార్లమెంటులో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా తెరాస శ్రేణులు నిరసనలతో హోరెత్తించాయి. మంత్రి కేటీఆర్ పిలుపుతో నియోజకవర్గాల వారీగా రోడ్డెక్కిన గులాబీదళం.... పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టారు.తొలిదశ పోలింగ్‌కు 'యూపీ' సిద్ధం.. UP Assembly Elections 2022: ఉత్తర్‌ప్రదేశ్‌లో తొలిదశ పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. యూపీ మహాసంగ్రామంలో 58 అసెంబ్లీ స్థానాలకు గురువారం ఎన్నికలు జరగనున్నాయి. కరోనా నేపథ్యంలో ఎన్నికల సంఘం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది.మేం గెలిస్తే ట్రిపుల్ రైడింగ్‌కు అనుమతి..OP Rajbhar News: 'ఎన్నికల్లో మా పార్టీ గెలిచి అధికారం చేపడితే.. బైక్‌పై ట్రిపుల్ రైడింగ్ నేరం కాదని ప్రకటిస్తాం. అలా కుదరదంటే రైలు, జీప్‌లకు కూడా చలాన్ వేస్తాం" అని హామీ ఇచ్చారు ఓ రాజకీయ పార్టీ అధినేత. ఇంతకీ ఎవరాయన? రైలుకు చలాన్ వేయడం వెనుక ఆయన లాజిక్ ఏంటి?కరోనా కొత్త వేరియంట్ డేంజర్ బెల్స్.. WHO on Covid Variants: కరోనా వైరస్ ఎప్పటికప్పుడు తన రూపాన్ని మార్చుకుని ప్రపంచదేశాలపై విరుచుకుపడుతూనే ఉంది. తాజాగా వెలుగుచూసిన ఒమిక్రాన్ ఉపవేరియంట్ అంతకుముందు ఉన్న ఉపవేరియంట్ కన్నా వేగంగా వ్యాప్తి చెందుతోందని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. అదే సమయంలో వ్యాక్సిన్లు రక్షణనిస్తున్నాయని తెలిపింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసుల సంఖ్య 40 కోట్లు దాటగా మరణాల సంఖ్య 57 లక్షలకు మించాయి.మార్కెట్లోని కొవిడ్‌కు కొత్త మందు..Glenmark nasal spray for covid: కొవిడ్ చికిత్సకు దేశీయంగా మరో ఔషధం అందుబాటులోకి వచ్చింది. ఫ్యాబీస్ర్పే పేరుతో ముంబయికి చెందిన ప్రముఖ ఫార్మా దిగ్గజం గ్లెన్‌మార్క్ నాజల్ స్ప్రేని మార్కెట్లోకి విడుదల చేసింది. కెనడాకు చెందిన సానోటైజ్ అనే భాగస్వామ్య కంపెనీతో కలిసి దీనిని రూపొందించింది.రంజీ ట్రోఫీకి ఇషాంత్ దూరం.. Ishanth Sharma out of Ranji Trophy: వృద్ధిమాన్ సాహా తర్వాత ఇప్పుడు ఇషాంత్ శర్మ కూడా రంజీ ట్రోఫీ నుంచి తప్పుకోబోతున్నట్లు తెలుస్తోంది. వచ్చేనెలలో శ్రీలంకతో జరిగే రెండు టెస్టుల సిరీస్‌కు తనను ఎంపిక చేయరని తెలిసి.. శర్మ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.దీపిక బోల్డ్ సీన్స్‌పై ట్రోల్స్..Deepika Padukone Gehraiyaan: బోల్డ్ సీన్స్‌లో నటించడంపై వస్తున్న ట్రోల్స్ గురించి స్పందించింది బాలీవుడ్ స్టార్ నటి దీపిక పదుకొణె. ఆ చిత్రాల్లో నటించేందుకు తన భర్త రణ్వీర్ సింగ్ అనుమతి తీసుకున్నారా లేదా అంటూ ప్రశ్నించడం స్టుపిడ్‌గా ఉందంటూ మండిపడింది.