తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @ 11AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

telangana top ten news today till now
టాప్​టెన్ న్యూస్ @ 11AM

By

Published : Feb 9, 2021, 10:59 AM IST

  • దీప్​ సిద్ధూ అరెస్ట్​

గణతంత్ర దినోత్సవం రోజున దేశ రాజధాని దిల్లీలో చెలరేగిన హింసాత్మక ఘటనల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పంజాబ్​ నటుడు దీప్​ సిద్ధూను పోలీసులు అరెస్ట్​ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • భారత్ @ 9,110

దేశంలో కొత్తగా 9,110 కరోనా కేసులు వెలుగుచూశాయి. మొత్తం బాధితుల సంఖ్య 1 కోటి 8లక్షల 47వేలు దాటింది. వైరస్​ సోకిన వారిలో మరో 14,016 మంది కోలుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

తెలంగాణ @ 149

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. మహమ్మారిపై ప్రజలకు అవగాహన రావడం, కొవిడ్ నిబంధనలు పటిష్ఠంగా పాటించడం వల్ల కేసులు తగ్గుతున్నాయి. రాష్ట్రంలో తాజాగా మరో 149 కొవిడ్ కేసులు నమోదవ్వగా.. వైరస్ బారిన పడి ఒకరు మృతి చెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • కాసేపట్లో అభిమానులతో ‌షర్మిల

ఏపీ సీఎం జగన్‌ సోదరి షర్మిల హైదరాబాద్‌లో కీలక సమావేశం నిర్వహించనున్నారు. లోటస్‌పాండ్‌ నివాసంలో జరిగే సమావేశానికి వైకాపా నేతలతో పాటు వైఎస్సార్ అభిమానులు, సన్నిహితులను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో కార్యకలాపాలను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై ప్రధాన చర్చ ఉంటుందని సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • రెండో సొరంగంలో సహాయక చర్యలు

ఉత్తరాఖండ్​లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలు గల్లంతైనవారి కోసం గాలిస్తున్నాయి. తపోవన్ విద్యుత్​ కేంద్రం వద్ద ఉన్న రెండో సొరంగంలో వంద మీటర్ల వరకు శిథిలాలను తొలగించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • సీఎం ఏరియల్​ సర్వే

ఉత్తరాఖండ్​లో ధౌలీగంగ వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు ఆ రాష్ట్ర సీఎం త్రివేంద్ర సింగ్​ రావత్​. వరదతో జరిగిన నష్టాన్ని ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • లాభాల్లో స్టాక్​ మార్కెట్లు

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలతో దేశీయ సూచీలు లాభాల్లో ప్రారంభమయ్యాయి. బాంబే స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​.. 179 పాయింట్ల లాభంతో 51,527 వద్ద కొనసాగుతోంది. ఆరంభ ట్రేడింగ్​లో 51,569 పాయింట్ల జీవితకాల గరిష్ఠాన్ని తాకిన సూచీ.. కాస్త వెనక్కి తగ్గింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • విజేతకు పట్టం

మయన్మార్​లో సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా చేస్తోన్న ఆందోళనలు ఉద్ధృతమవుతోన్న వేళ.. మిలటరీ కమాండర్​ జనరల్​ మిన్​ ఆంగ్​ హ్లైంగ్​ మీడియాతో మాట్లాడారు. దేశాన్ని తమ అధీనంలోకి తీసుకున్న తరువాత ఆయన తొలిసారిగా మాట్లాడారు. కానీ ప్రజలు చేస్తోన్న నిరసనల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • అంపైర్లను ప్రభావితం చేస్తున్నాడు

భారత కెప్టెన్ విరాట్​ కోహ్లీ అంపైర్లను ప్రభావితం చేస్తున్నాడని ఇంగ్లాండ్​ మాజీ బ్యాట్స్​మెన్​ డేవిడ్​ లాయిడ్​ ఆరోపించాడు. విరాట్​ అతిగా అప్పీలు చేస్తున్నాడని తన డైలీ మెయిల్​లో రాసుకున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • పవర్ ఫుల్​ పాత్రలో నాగ చైతన్య!

అక్కినేని హీరో నాగ చైతన్య తన కొత్త చిత్రంలో పోలీస్ ఆఫీసర్​గా కనిపించనున్నాడట. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ABOUT THE AUTHOR

...view details