1. బంగ్లాదేశ్‌తో మైత్రికి ప్రాధాన్యం
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా గురువారం వర్చువల్ సదస్సులో పాల్గొన్నారు. భారత్-బంగ్లాదేశ్ మధ్య చిలాహటి-హల్దిబరి రైలు లింక్ ఆవిష్కరించారు. ఈ క్రమంలో తమ విదేశీ విధానంలో బంగ్లాదేశ్‌కు పెద్ద పీట వేసినట్టు మోదీ పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
2. మరో రైతు మృతి
దిల్లీ-హరియాణా సింఘూ సరిహద్దు వద్ద మరో రైతు ప్రాణాలు కోల్పోయాడు. పంజాబ్‌కు చెందిన రైతు.. అక్కడ కాలువలో పడిపోయినట్లు సమాచారం. ఆస్పత్రికి తరలించగా.. మరణించినట్లు ధ్రువీకరించారు వైద్యులు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
3. పాదచారిపై కూలిన పిల్లర్
రాజస్థాన్ భరత్‌పుర్‌లోని ఓ మార్కెట్‌లో నిర్మాణంలో ఉన్న భవనం పిల్లర్ కూలి.. అటుగా వెళ్తున్న పాదచారిపై పడింది. తీవ్రగాయాల పాలైన ఆ యువకుడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
4. ఆన్‌లైన్ అప్పు.. ప్రాణానికి ముప్పు
ఆన్‌లైన్ అప్పులకు మరో వ్యక్తి బలయ్యారు. నిర్దేశించిన గడువులోగా రుణం చెల్లించలేదన్న కారణంగా అప్పిచ్చిన సంస్థ రుణగ్రహీత వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగేలా వ్యవహరించడంతో ఓ ప్రభుత్వ అధికారిణి బలవన్మరణానికి పాల్పడ్డారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
5. పాలమూరులో పాప నవ్వింది..
వెనుకబడిన జిల్లాగా పేరొందిన ఉమ్మడి పాలమూరులో లింగ వివక్ష తగ్గుతోంది.. స్త్రీ శక్తి పెరుగుతోంది.. పురుషుల కన్నా మహిళల నిష్పత్తిలో వృద్ధి నమోదవుతోంది.. ఆడపిల్ల పుడితే అయ్యో అనుకున్న పరిస్థితి నుంచి నేడు మహాలక్ష్మిగా భావించి ఆహ్వానించే పరిస్థితి నెలకొంది.. వెయ్యి మంది పురుషులకు సగటున 1,039 మంది మహిళల నిష్పత్తి నమోదవడమే ఇందుకు నిదర్శనం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి