ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు...ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకి రావాలి.. KCR Meet Uddhav Thackeray : 75 ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత కూడా అనేక సమస్యలు ఉన్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకి రావాల్సిన సమయమిదని తెలిపారు. దేశ రాజకీయాలపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో చర్చించినట్లు పేర్కొన్నారు. ఇంకా అనేక ప్రాంతీయ పార్టీల నేతలతో చర్చలు జరుపుతామని వెల్లడించారు.కేసీఆర్ పర్యటనలో ప్రధాన ఆకర్షణగా ప్రకాశ్‌రాజ్..Prakash Raj With KCR: సీఎం కేసీఆర్ ముంబయి పర్యటనలో నటుడు ప్రకాశ్‌రాజ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. స్వాగతం పలకటం దగ్గర్నుంచి పర్యటన ముగించుకుని తిరిగి వెళ్లే వరకు కేసీఆర్ వెంటే ఉండి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇంతకూ.. కేసీఆర్ పర్యటనలో ఎవరూ ఊహించని విధంగా.. ప్రకాశ్‌రాజ్ ఇంత చురుకుగా పాల్గొనటానికి కారణాలేంటీ..?బయ్యారంపై కేంద్రానిది తుక్కు సంకల్పం.. KTR Letter To Central Minister: బయ్యారం ఉక్కు కర్మాగారం నిర్మాణం విషయంలో కేంద్ర ప్రభుత్వ వివక్ష పూరిత వైఖరిపైన మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. నాణ్యమైన ఇనుప ఖనిజ సంపద అందుబాటులో ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ సంకల్ప లోపమే బయ్యారం ప్లాంట్ నిర్మాణానికి శాపంగా మారిందని కేటీఆర్ అన్నారు.యూపీ మూడో దశ పోలింగ్ ప్రశాంతం..UP polls third phase: ఉత్తర్‌ప్రదేశ్ శాసనసభ మూడో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 59 స్థానాల్లో ఓటింగ్ జరగగా.. సాయంత్రం 5 గంటల వరకు మొత్తం 57 శాతం ఓటింగ్ నమోదైంది.పంజాబ్‌లో 63 శాతం ఓటింగ్.. Punjab Assembly elections: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 1,304 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు ఓటర్లు. సాయంత్రం ఐదు గంటల వరకు 63 శాతం పోలింగ్ నమోదైంది.ఏ క్షణంలోనైనా యుద్ధం..Shelling in east Ukraine: తూర్పు ఉక్రెయిన్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉక్రెయిన్ సైన్యం, రష్యా వేర్పాటువాదుల పరస్పర దాడులు తారస్థాయికి చేరాయి. మరోవైపు.. సరిహద్దుల్లో రష్యా అణుపాటవాన్ని ప్రదర్శిస్తోంది. అక్కడి పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు.నేపాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు.. Violent protests in Kathmandu: నేపాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా ఆర్థిక సాయానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలతో కాఠ్మాండూ అట్టుడుకుతోంది. అమెరికా 500 మిలియన్ డాలర్లను (రూ. 3,734 కోట్లకుపైగా) నేపాల్‌కు సాయంగా అందించాలని నిర్ణయించింది.బంగారం ధరకు ఇక రెక్కలే...Gold prices may skyrocket: ఈ ఏడాది ద్వితీయార్ధంలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.55 వేల మార్కు దాటనుందా? మరో 3 నెలల్లోనే రూ.52 వేలకు చేరనుందా? రష్యా- ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు పసిడి ధర పెరుగుదలకు కారణమవుతున్నాయా? అవుననే అంటున్నాయి బులియన్ మార్కెట్ విశ్లేషకులు.సాహాలా ఎవరికీ జరగకుండా చూడండి.. Harbhajan Singh News: భారత జట్టు ప్లేయర్లకు అండగా నిలవాలని బీసీసీఐను కోరాడు చేశాడు టీమ్ఇండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్. వృద్ధిమాన్ సాహాతో ఓ పాత్రికేయుడు అవమానకరంగా వ్యవహించిన నేపథ్యంలో ఈ మేరకు విజ్ఞప్తి చేశాడు.సమంత కోసం రూ.3 కోట్ల హోటల్..Samantha Yasodha: సమంత 'యశోద' కోసం అదిరిపోయే రేంజ్లో ఖర్చు చేస్తున్నారు. దాదాపు రూ.3 కోట్లు ఖర్చు చేసి 7 స్టార్ హోటల్ సెట్‌ను రూపొందించారు. ప్రస్తుతం ఇందులోనే షూటింగ్ జరుగుతోంది.