తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana News Today టాప్​ న్యూస్​ 5PM - 5PM టాప్​ న్యూస్​

ఇప్పటి వరకు ఉన్న ప్రధానవార్తలు

5pm topnews
5pm topnews

By

Published : Aug 16, 2022, 4:59 PM IST

  • ఆ దేశాల మధ్య అణు యుద్ధం జరిగితే 500 కోట్ల మంది ప్రాణాలు గాల్లోకి

అత్యాధునిక అణు యుద్ధం సంభవిస్తే కనీసం 500 కోట్ల మంది ప్రాణాలు కోల్పోతారని ఓ పరిశోధనలో తేలింది. అమెరికా-రష్యా మధ్య జరిగే అణు యుద్ధం భూగోళంపై భయంకరమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని పరిశోధన తేల్చింది. ఈ యుద్ధం వల్ల సగానికిపైగా మానవాళి తుడిచిపెట్టుకుపోతుందని పేర్కొంది.

  • ఆ ప్రాజెక్టు సందర్శించకుండా కాంగ్రెస్​ నేతలను అడ్డుకున్న పోలీసులు

దుమ్ముగూడెం ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్న కాంగ్రెస్​ నేతల బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ప్రాజెక్టు సందర్శనకు అనుమతి లేదంటూ బొజిగుప్ప వద్దనే వారిని నిలిపివేశారు. ఈ క్రమంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.

  • ఉచితాలపై ప్రధాని వ్యాఖ్యలను తెరాస వక్రీకరిస్తోందని బండి ఆగ్రహం

జనగామ జిల్లాలోని పాలకుర్తి మండలంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజాసంగ్రామ యాత్ర కొనసాగుతోంది. పోలీసులను పెట్టి పాదయాత్రకు ప్రజలు రాకుండా అడ్డుకుంటున్నారని సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • కారులో బాంబు ఉందంటూ ఫోన్ కాల్,​ చివరికి ఏమైందంటే

హైదరాబాద్​లో ఓ కారు కలకలం సృష్టించింది. భాజపా రాష్ట్ర కార్యాలయం వద్ద పార్కింగ్ చేసిన నానో కారు పోలీసులకు ముచ్చెటమలు పట్టించింది. కారును తనిఖీ చేసిన పోలీసులు చివరికీ ఊపిరి పీల్చుకున్నారు. అసలు కారులో ఏముందంటే

  • ఆ సమయానికి రెడ్‌ సిగ్నల్‌ పడి జనగణమన గీతం వచ్చేలా ప్రోగ్రామింగ్

స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. పదకొండున్నరకు ఎక్కడివారు అక్కడే నిల్చొని జాతీయగీతం ఆలపించారు. అయితే హైదరాబాద్​ పరిధిలో ఆన్‌లైన్‌లో అనుసంధానమైన కూడళ్ల వద్ద రెడ్‌ సిగ్నల్‌ పడి జనగణమన గీతం వచ్చేలా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ప్రోగ్రాం చేశారు.

  • ప్రాక్టీస్​ సెషన్​లో పల్టీలు కొట్టిన కబడ్డీ ప్లేయర్, తలకు తీవ్ర గాయంతో మృతి

కబడ్డీ ప్రాక్టీస్​ సెషన్​లో ఉత్సాహంతో పల్టీలు కొట్టిన ఓ ప్లేయర్​ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. తమిళనాడులోని తిరువణ్నామలై జిల్లాలో ఈ విషాదం చోటుచేసుకుంది.

  • టీమ్​ఇండియాకు ఎదురుదెబ్బ, సుందర్​ స్థానంలో ఆడేది అతడే

ఇటీవలే గాయపడిన ఆల్​రౌండర్​ వాషింగ్టన్ సుందర్​ జింబాబ్వే పర్యటనకు దూరమయ్యాడు. అతడి స్థానంలో మరో ఆటగాడి పేరును ప్రకటించింది బీసీసీఐ. ఎవరంటే

  • స్టార్ క్రికెటర్​ ఆటకు వీడ్కోలు, సెలక్టర్స్​ వల్లే

ఐర్లాండ్‌ క్రికెట్‌ దిగ్గజం కెవిన్‌ ఒబ్రెయిన్‌ అభిమానులకు షాకింగ్​ న్యూస్ చెప్పాడు. తన పదహారేళ్ల సుదీర్ఘ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు.

  • నిఖిల్​ కార్తికేయ 2కు వార్నింగ్​ ఇవ్వడంపై దిల్​రాజు వివరణ

కార్తికేయ-2 విడుదల విషయంలో తనపై జరిగిన ప్రచారంపై నిర్మాత దిల్​రాజు వివరణ ఇచ్చారు. సినిమాలను ఎవరు తొక్కాలని చూడరని అన్నారు. అవాస్తవాలు రాసే ముందు నిజాలు తెలుసుకుని రాయండి అని చెప్పుకొచ్చారు.

  • రెమ్యునరేషన్ విషయంలో నిర్మాతకు ఎన్టీఆర్​​ షాక్

'మనదేశం' నుంచి 'మేజర్​' వరకు నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు. అయితే తాజాగా ఆయన గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారు నిర్మాత అశ్వినీదత్​.

ABOUT THE AUTHOR

...view details