తెలంగాణ

telangana

ETV Bharat / city

7AM టాప్​న్యూస్ - 7AM టాప్​న్యూస్

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

7AM TOPNEWS
7AM TOPNEWS

By

Published : Aug 13, 2022, 6:58 AM IST

  • ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే?

ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

  • త్వరలో కరెంటు నెలకో రేటు

ఖర్చును బట్టి ఛార్జీలు సవరించుకునే పూర్తిగా ‘విద్యుత్‌ పంపిణీ సంస్థలకే కట్టబెడుతూ కేంద్ర విద్యుత్‌ చట్ట నియమావళికి సవరణలను కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇంతకాలం ఈఆర్‌సీ ఆదేశాలుంటేనే పెంచుకునే అవకాశం ఉండేది.

  • 'నాలుగు కేంద్ర మంత్రి పదవులు అడిగితే.. భాజపా అప్పుడు ఒప్పుకోలేదు'

బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్ కుమార్.. భాజపాపై కీలక వ్యాఖ్యలు చేశారు. 2019లో నాలుగు కేంద్రమంత్రి పదవులు ఇవ్వాలన్న తన డిమాండ్‌ను భాజపా తిరస్కరించినప్పుడే ఇక తమ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో చేరకూడదని నిర్ణయించుకున్నట్టు నితీశ్ వెల్లడించారు.

  • ప్రముఖ రచయిత సల్మాన్‌ రష్దీపై దాడి..

ప్రముఖ నవలా రచయిత, భారత సంతతికి చెందిన సల్మాన్​ రష్దీపై న్యూయార్క్​లో దాడి జరిగింది. ఓ కార్యక్రమంలో ప్రసంగించేందుకు సిద్ధమవుతుండగా.. దుండగుడు కత్తితో దాడి చేశాడు. రష్దీ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు.

  • రుణగ్రహీతలను వేధించొద్దు..

రుణ వసూళ్ల విషయంలో రికవరీ ఏజెంట్ల దారుణాలను అరికట్టేందుకు ఆర్‌బీఐ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. రికవరీ ఏజెంట్లను నియంత్రించాలని స్పష్టం చేసింది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల లోపే రుణ రికవరీ ఏజెంట్లు, రుణగ్రహీతలకు ఫోన్‌ చేయాలని పేర్కొంది.

  • కాజ్​వేలు నీట మునగడంతో లంక గ్రామాలకు పడవల పైనే ప్రయాణం

ఎగువ నుంచి వస్తున్న వరదతో ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. కోనసీమలోని నదీ పాయలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. లంక గ్రామాలకు వెళ్లే కాజ్‌వేలు నీటమునిగి పడవలపైనే ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అనవసర ప్రయాణాలను మానుకోవాలని అధికారులు సూచించారు.

  • నల్లమలలో పెద్ద పులికి ఆపదొచ్చింది

పులుల నడకలో ఆ రాజసం. చూపులో గాంభీర్యం. వేటలో వేగం. అంతేనా పెద్దపులి గర్జిస్తే ఒక్కోసారి సింహాలైనా భయపడాల్సిందే. అలాంటి ఆ వన్యప్రాణులకు తమ అడ్డాలోనే ప్రాణసంకటం తప్పటం లేదు.

  • మహిళల ఐపీఎల్​కు టైమ్​ ఫిక్స్​.. ఎప్పుడంటే?

పూర్తిస్థాయి మహిళల ఐపీఎల్‌కు రంగం సిద్ధమైంది. వచ్చే ఏడాది మార్చిలో నెల రోజుల పాటు ఐదు జట్లతో మహిళల ఐపీఎల్‌ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించినట్లు సమాచారం.

  • సీక్వెల్స్​ జోరు.. అంచనాలు పెంచారు.. ఇక రావడమే ఆలస్యం!

'బాహుబలి', 'కేజీయఫ్'​ సీక్వెల్స్​ ఘన విజయాన్ని అందుకోవడంతో కొనసాగింపు చిత్రాల హవా కాస్త ఎక్కువగానే పెరిగింది. ఇప్పటికే విడుదలైన 'పుష్ప', 'విక్రమ్​' తొలి భాగం సూపర్ హిట్​ కావడం వల్ల రెండో భాగంపై బాగా ఆసక్తి పెరిగింది. అయితే దీంతో పాటే మరి కొన్ని కొనసాగింపు చిత్రాలు సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి.

  • రణ్​వీర్​ సింగ్​కు ముంబయి పోలీసుల సమన్లు.. ఆగస్టు 22లోగా!

ఇటీవల న్యూడ్​ ఫొటోషూట్​తో వివాదంలో చిక్కుకున్న బాలీవుడ్​ స్టార్​ హీరో రణ్​వీర్​ సింగ్​ను ముంబయి పోలీసులు విచారించనున్నారు. ఆగస్టు 22న విచారణకు హాజరుకావాలని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details