తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana Top News: టాప్​న్యూస్ @5PM - 5PM టాప్​న్యూస్

ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు

5PM TOPNEWS
5PM TOPNEWS

By

Published : Aug 10, 2022, 4:59 PM IST

  • ఉపరాష్ట్రపతిగా చివరి రోజు..

మొక్కలు నాటేందుకు, పరిరక్షించేందుకు అందరూ చొరవ చూపాలని కోరారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. బుధవారం ఉపరాష్ట్రపతిగా పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో పార్లమెంటులో 'సీత అశోక' మొక్కను నాటారు వెంకయ్య. భారతీయ సంప్రదాయంలో చెట్ల ప్రాముఖ్యాన్ని గుర్తుచేశారు.

  • నీతీశ్​ దెబ్బకు భాజపాకు కొత్త కష్టాలు.. కీలకంగా వైకాపా!

లోక్‌సభలో బంపర్‌ మెజార్టీ కలిగిన అధికార ఎన్డీఏకు జేడీయూ వైదొలిగిన తర్వాత రాజ్యసభలో గడ్డు పరిస్థితులు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదివరకు మాదిరిగా కీలక బిల్లులను పెద్దలసభ ఆమోదం పొందటం అంత సులభం కాకపోవచ్చు.

  • కాసేపట్లో పెళ్లి.. అంతలోనే ప్రియురాలి ఎంట్రీ..

కాసేపట్లో పెళ్లి ముహుర్తం.. బంధువులందరి చేతుల్లో అక్షతలు.. పంతులు నోట వేద మంత్రాలు.. మేళతాళాల చప్పుడు.. వధువు మెడలో వరుడు తాళి కట్టటమే తరువాయి. ఇంతలోనే.. ఆపండీ... అంటూ ఓ యువతి అరుపు.. కట్​ చేస్తే.. పెళ్లి ఆగిపోవటం.. ఫ్లాష్​బ్యాక్​ స్టోరీ..!! ఇదంతా తెలుగు సినిమాల్లోని పెళ్లి సన్నివేశాల్లో మనం తరచూ చూసేదే. అయితే.. అచ్చంగా ఇదే సన్నివేశం నిజజీవితంలోనూ జరిగింది. నమ్మట్లేదా.. అయితే ఈ స్టోరీ చదివేయండి..

  • మునుగోడులోనూ హుజూర్​నగర్​, నాగార్జునసాగర్ సీన్ రిపీట్: కవిత

మునుగోడు ఉపఎన్నికల్లోనూ తెరాసదే విజయమని ఎమ్మెల్సీ కల్వకుంట కవిత ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ మార్గనిర్దేశకంగా నిలుస్తుందన్న ఆమె మునుగోడులో తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే లేకున్నా అభివృద్ధి ఆగలేదని చెప్పారు.

  • పాదయాత్రలో ఆసక్తికర సన్నివేశం.. కల్లు రుచి చూసిన బండి సంజయ్

నల్గొండ జిల్లాలో కొనసాగుతున్న బండి సంజయ్ ప్రజాసంగ్రామ మూడో విడత యాత్రలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఎనిమిదో రోజు పాదయాత్రలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కల్లు రుచి చూశారు. కల్లు గీసే గౌడ కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

  • నిండుకుండలా శ్రీశైలం.. పది గేట్ల ద్వారా నీటి విడుదల

ఎగువ నుంచి వరద పోటెత్తడంతో శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. దీంతో 10 గేట్లు ఎత్తిన అధికారులు దిగువకు నీటిని విడుదల చేశారు. శ్రీశైల జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.30 అడుగులుగా ఉంది.

  • కంటిలో జాతీయ జెండా పెయింటింగ్

తమిళనాడుకు చెందిన ఓ సూక్ష్మ కళాకారుడు తన దేశభక్తిని చాటుకున్నాడు. కంటిలో జాతీయ జెండా పెయింటింగ్​ వేసుకున్నాడు. వైద్యులు వద్దని సూచించినా.. కళాకారుడు సాహసం చేశాడు.

  • టాటా, బిర్లా ముందుచూపు.. స్వాతంత్ర్యానికి ముందే పక్కా ప్లాన్!

ఒకవైపు వ్యాపారంలో ఆంగ్లేయులతో పోటీ పడుతూ.. మరోవైపు స్వాతంత్య్రోద్యమానికి అండగా నిలిచిన భారత పారిశ్రామికవేత్తలు.. మరో అడుగు కూడా ముందే వేశారు! అదే.. స్వాతంత్య్రానంతర భారతావనికి దార్శనికపత్రం రూపొందించటం. ఆంగ్లేయులు పంద్రాగస్టు అనే తేదీని ప్రకటించకముందే.. రెండో ప్రపంచ యుద్ధం ఇంకా ముగియకముందే.. టాటా, బిర్లా తదితర పారిశ్రామికవేత్తలంతా కలసి ముందుచూపుతో 1944లోనే స్వతంత్ర భారత పారిశ్రామిక ప్రణాళికను రచించారు.

  • సూర్య జోరు.. కెరీర్​లోనే అత్యుత్తమ ర్యాంక్​

ఐసీసీ విడుదల చేసిన తాజా టీ-20 ర్యాకింగ్స్‌లో టీమ్‌ఇండియా ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ అదరగొట్టాడు. కెరీర్​లోనే అత్యుత్తమ ర్యాంక్​కు చేరుకున్నాడు.

  • ప్రముఖ కమెడియన్​కు గుండెపోటు..

ప్రముఖ కమెడియన్​ రాజు శ్రీవాస్తవ అకస్మాతుగా గుండెపోటుకు గురయ్యారు. ఆయన జిమ్​లో వర్కౌట్లు చేస్తుండగా ఒక్కసారి అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.

ABOUT THE AUTHOR

...view details