తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana News Today: టాప్‌ న్యూస్ @7PM - Telangana News Today

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TELANGANA TOP NEWS
TELANGANA TOP NEWS

By

Published : Aug 2, 2022, 6:58 PM IST

  • పాక్​ వర్సెస్ భారత్​.. మ్యాచ్ ఎప్పుడంటే?

ASIA CUP SCHEDULE: 2022 ఆసియా కప్ షెడ్యూల్​ విడుదలైంది. తొలి మ్యాచ్​ శ్రీలంక, అఫ్గానిస్థాన్ మధ్య జరగనుంది. టోర్నీలో రెండో మ్యాచ్​లో భాగంగా ఇండియా, పాకిస్థాన్ తలపడనున్నాయి.

  • రాజకీయాల్లో ఇమ్రాన్ ఖాన్​​పై బ్యాన్?

Imran Khan News: పాక్​ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్​ఖాన్​తో పాటు ఆయన పార్టీని రాజకీయాల నుంచి బ్యాన్​ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇమ్రాన్​ అక్రమంగా విదేశీ నిధులు అందినట్లు ఆ దేశ ఎన్నికల సంఘం ఆరోపించింది. మరోవైపు పాక్‌ ఎన్నికల కమిషన్‌ రూలింగ్‌ను తాము సవాలు చేస్తామని పీటీఐ (పాకిస్థాన్‌ తెహ్రీ ఇ ఇన్సాఫ్‌) ప్రతినిధి ఫవాద్‌ చౌధురి విలేకర్లకు వెల్లడించారు.

  • డిగ్రీ పరీక్షలో గందరగోళం..

శాతవాహన వర్సిటీ పరిధిలో డిగ్రీ పరీక్షలో గందరగోళం నెలకొంది. 4వ సెమిస్టర్ సంస్కృత పరీక్షకు పాత సిలబస్‌తో ప్రశ్నాపత్రం ఇచ్చారు. విద్యార్థులు పరీక్ష రాస్తుండగా.. తప్పును ఆలస్యంగా గుర్తించిన అధికారులు పరీక్షను రద్దు చేశారు.

  • గడువు దాటినా ఖాళీ చేయట్లేదు..

demolish fruit shops: ఎంజే మార్కెట్​ పరిధిలో లీజు గడువు ముగిసినా ఖాళీ చేయని దుకాణాలపై గ్రేటర్ అధికారులు ఉక్కుపాదం మోపారు. కోర్టు ఆదేశాల మేరకు ఇవాళ వచ్చి దుకాణాలను కూల్చివేశారు. చెప్పాపెట్టకుండా ఎలా కూల్చివేస్తారమంటూ దుకాణాదారులు కాసేపు వాగ్వాదానికి దిగడంతో.. కూల్చివేత సమయంలో ఉద్రిక్తత నెలకొంది.

  • ప్రముఖుల నివాళులు..

సోమవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచిన కంఠమనేని ఉమామహేశ్వరి పార్థివదేహానికి పలువురు రాజకీయ ప్రముఖులతో పాటు బంధువులు నివాళులర్పించారు. కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు.

  • పాములు పాలు తాగవు..

నాగులపంచమి రోజు పుట్టల్లో పాలు పోయటంపై కరీంనగర్​లో జంతు పరిరక్షణ సంఘం భక్తులకు అవగాహన కల్పించింది. పాములు పాలు తాగవని స్పష్టం చేశారు. పుట్టల్లో పాలు పోయటం వల్ల అందులోనే చనిపోయే ప్రమాదం ఉందన్నారు.

  • దంచికొడుతున్న వానలు..

RAINS IN AP: ఏపీలో వానలు దంచికొడుతున్నాయి. నిన్న అనంతపురం, సత్యసాయి జిల్లాలో భారీ వర్షాలు కురవగా నేడు ఉమ్మడి కర్నూలు జిల్లాలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. నెరవాడ వాగు దాటేందుకు వెళ్తున్న ఐదుగురిలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. అనేక ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

  • ప్రభుత్వ అధికారిణి ఆత్మహత్య..

భవనం ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది ఓ ప్రభుత్వ అధికారిణి. ఈ ఘటన మధ్యప్రదేశ్​లోని భోపాల్​లో జరిగింది.

  • జావలో పడి మరణించిన భక్తుడు..

పూజ కోసం చేస్తున్న జావలో (గంజి, అంబలి) పడి ఓ వ్యక్తి మరణించాడు. ఈ ప్రమాదం తమిళనాడు మదురైలో జరిగింది. మరో ఘటనలో ఏసీ పేలి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.

  • సెక్స్​ గురించి కరణ్ ప్రశ్న.. నటి దీటైన రిప్లై..

కాఫీ విత్ కరణ్​ షోకు విచ్చేసిన ఆమిర్ ఖాన్, కరీనా కపూర్.. కరణ్​ను ఓ ఆట ఆడుకున్నారు. పంచ్​లు, సెటైర్లు వేస్తూ ఆద్యంతం సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. మీరూ ఓసారి చూసేయండి..

ABOUT THE AUTHOR

...view details