తెలంగాణ

telangana

ETV Bharat / city

TOP NEWS: టాప్​ న్యూస్ @9 PM - top news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP NEWS: టాప్​ న్యూస్ @9 PM
TOP NEWS: టాప్​ న్యూస్ @9 PM

By

Published : Jun 20, 2022, 9:00 PM IST

  • ప్రధాన సూత్రధారి అతడే..!

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ విధానాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో చెలరేగిన అల్లర్లకు సంబంధించి కామారెడ్డి వాసి మధుసూదన్‌ను ప్రధాన సూత్రధారిగా పోలీసులు తేల్చారు. పక్కా ప్రణాళికతోనే సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో విధ్వంసం సృష్టించారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు సికింద్రాబాద్ అల్లర్ల కేసు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

  • ప్రైవేట్‌ ఆస్పత్రికి రూ.24 కోట్ల భారీ జరిమానా..

హైదరాబాద్‌లో ఓ ఆస్పత్రికి అధికారులు భారీ జరిమానా విధించారు. ఆస్తి ప‌న్ను స్వీయ మదింపులో త‌ప్పుడు వివ‌రాలు స‌మ‌ర్పించిన ఆస్పత్రి యాజమాన్యానికి నగరపాలక సంస్థ అధికారులు రూ.24 కోట్ల జరిమానా విధించారు.

  • ఆ ఫ్లాట్లకు భారీగా దరఖాస్తులు..

బండ్లగూడ, పోచారం రాజీవ్ స్వగృహ ఫ్లాట్లకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. బండ్లగూడలోని ఫ్లాట్ల కోసం 33,161 మంది, పోచారంలోని రాజీవ్ స్వగృహ కోసం 5,921 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 27 నుంచి లాటరీ పద్ధతిలో ఫ్లాట్లు కేటాయించనున్నారు.

  • 'సాయిపల్లవిని చూస్తే నా చెల్లిని చూసినట్టే ఉంది'

విరాటపర్వం సినిమాలో సాయిపల్లవిని చూస్తే తమ చెల్లెలిని చూసినట్టుగానే ఉంది సరళ అక్క పద్మ తెలిపారు. తన చెల్లెలిపై సినిమా తీసి తనపై ఉన్న ప్రచారాలకు సమాధానం చెప్పారన్నారు.

  • ఈతకు వెళ్లి నలుగురు పిల్లలు మృతి..

ఆంధ్రప్రదేశ్​లోని ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈతకు వెళ్లి నలుగురు పిల్లలు మృతి చెందారు. పుల్లల చెరువు మండలం కవలకుంట్ల చెరువులో ఈతకు దిగి.. సాయిరెడ్డి (12), విష్ణురెడ్డి ‍(13), బ్రహ్మారెడ్డి (14), మణికంఠ ‍(14)లు ప్రాణాలు కోల్పోయారు. పిల్లల మృతితో ఆయా కుటుంబాల్లో రోదనలు మిన్నంటాయి.

  • పోలీస్​ యూనిఫాంలో సిద్ధూ హత్యకు ప్లాన్..

సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన నిందితులైన ఇద్దరు షూటర్లు సహా మరొకర్ని దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. హత్యకు ముందు జరిగిన విషయాలను మీడియాకు వెల్లడించారు. మొదట పంజాబ్​ పోలీస్​ యూనిఫాంలు ధరించి సిద్ధూను చంపాలని నిందుతులు ప్లాన్ చేశారని తెలిపారు. సిద్ధూపై మొదట కాల్పుల జరిపింది ఎవరో కూడా చెప్పారు.

  • నీ మాల్​ను అంబానీకి అమ్మేయ్..

బెంగళూరులో మెట్రో షాపింగ్ మాల్​కు బెదిరింపు లేఖ వచ్చింది. షాపింగ్ మాల్​ను అంబానీకి అమ్మాలని లేఖలో దుండగులు పేర్కొన్నారు. లేదంటే చంపేస్తామని హెచ్చరించారు.

  • బంగ్లాదేశ్​లో వరద బీభత్సం..

బంగ్లాదేశ్‌లో వరద బీభత్సం కొనసాగుతోంది. గత మూడురోజులుగా కురుస్తున్న వర్షాలకు ఈశాన్య, ఉత్తర ప్రాంతాల్లో భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది.

  • రుతురాజ్​, మెద్వెదేవ్​పై ఫ్యాన్స్​​ ఫైర్​..

టీమ్​ఇండియా ప్లేయర్​ రుతురాజ్​ గైక్వాడ్​, రష్యన్‌ టెన్నిస్‌ స్టార్‌, ప్రపంచ నంబర్‌ 1 ఆటగాడు మెద్వెదేవ్​పై నెటిజన్లు మండిపడుతున్నారు. మైదానంలో వారు వ్యవహరించిన తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏం జరిగిందంటే..

  • నయనతార హనీమూన్ ఫొటోలు వైరల్​..

ఇటీవలే పెళ్లి చేసుకున్న లవ్​బర్డ్స్​ నయనతార-విఘ్నేశ్​.. హనీమూన్​ను ఎంజాయ్ చేస్తున్నారు. థాయ్​లాండ్​లో సరదాగా గడుపుతున్నారు. ఈ మేరకు రొమాంటిక్​ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు విఘ్నేశ్​. అవి కాస్తా వైరల్​గా మారాయి.

ABOUT THE AUTHOR

...view details