ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలురూ.10 లక్షలు ఇచ్చి పరువు హత్య భువనగిరిలో పరువు హత్య కలకలం రేపింది. పట్టణంలో శుక్రవారం అదృశ్యమైన స్థిరాస్తి వ్యాపారి రామకృష్ణ.. విగతజీవిగా బయటపడ్డాడు. కుమార్తె ఇష్టం లేని వివాహం చేసుకుందనే కోపం, ఆస్తిలో వాటా అడుగుతున్నారనే కక్షతో యువతి తండ్రే సుపారి ఇచ్చి హత్య చేయించినట్లు పోలీసులు తేల్చారు.భక్త జనసంద్రంగా మారిన ప్రాణహితPranahitha pushkaralu: ప్రాణహిత నదీ తీరం భక్తజన సంద్రంగా మారింది. ఆదివారం సెలవు కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు ఘాట్ల వద్ద పుణ్య స్నానాలు ఆచరించారు. బారులు తీరి కాళేశ్వరం ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు.పోలీసు శాఖలో ‘జంట’ వేదన... భార్య ఓచోట.. భర్త మరోచోట విధులు నిర్వర్తించాల్సి రావడంతో దంపతులైన ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎవరికి చెప్పాలో తెలియక.. సమస్యకు పరిష్కారమెప్పుడో తెలియక సతమతమవుతున్నారు. ఏ1గా రామాయంపేట మున్సిపల్ ఛైర్మన్కామారెడ్డిలో సంచలనంగా మారిన తల్లీ, కుమారుడు ఆత్మాహుతి కేసులో పోలీసులు వేగం పెంచారు. ఇప్పటికే ఏడుగురిపై కేసులు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక విచారణాధికారిని నియమించారు. నిందితులను పట్టుకునేందుకు మూడు బృందాలతో గాలిస్తున్నారు. దవాఖానాల్లో 'దాహం'.. వేసవి ఎండలు.. ప్రభుత్వ దవాఖానాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. చాలా ఆసుపత్రుల్లో తాగునీటి కొరత ఏర్పడుతోంది. ఎక్కువ చోట్ల మూణ్నాలుగు రోజులకోసారి నీళ్లు వస్తుండడంతో.. దవాఖానాల్లో పూర్తిస్థాయిలో నీటి అవసరాలు తీరడంలేదు.గుజరాత్లో మోదీ మూడు రోజుల పర్యటన..Modi On WHO Traditional Medicine: భారత్‌లో ప్రపంచ ఆరోగ్య సంస్థ సంప్రదాయ ఔషధ కేంద్ర ఏర్పాటుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సంస్థ ఏర్పాటు ప్రతీ భారతీయుడికి గర్వకారణమన్నారు.కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. Sonipat Fire News: హరియాణా సోనిపట్‌లోని ఓ రసాయన పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అప్రత్తమైన అగ్నిమాపక అధికారులు సహాయక చర్యలు చేపట్టి 20 మంది కార్మికులను రక్షించారు.500శాతం పెరిగిన కేసులుCovid Spread In Delhi: దిల్లీలో కరోనా రోజురోజుకు అధికమవుతోంది. తాజాగా రాజధాని పరిసర ప్రాంతాల్లో కొవిడ్ వ్యాప్తి 15 రోజుల్లోనే 500శాతం పెరిగినట్లు లోకల్‌సర్కిల్స్ సర్వేలో వెల్లడైంది.చెన్నైకి మళ్లీ నిరాశే.. IPL 2022 CSK VS GT: ఐపీఎల్ 2022లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. డేవిడ్ మిల్లర్ 92* పరుగులు చేసి టైటాన్స్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు.అనూ హాట్ ట్రీట్..అనూ ఇమాన్యుయల్, ఆకాంక్ష, నివేదా థోమస్, సీరత్‌కపూర్ సహా పలువురు ముద్దుగుమ్మలు తమ కిల్లింగ్ పోజులతో అదరగొట్టారు. ఆ ఫొటోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. వాటిని చూసేద్దాం...