ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు జేపీ నడ్డా ర్యాలీకి వెళ్తారా? కాసేపట్లో భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా శంషాబాద్ చేరుకున్నారు. నడ్డాకు స్వాగతం పలికేందుకు భాజపా శ్రేణులు తరలివెళ్లాయి. జేపీ నడ్డాకు విమానాశ్రయంలోనే నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.' ర్యాలీకి అనుమతి ఇవ్వలేం'భాజపా ర్యాలీకి అనుమతిలేదని అధికారికంగా పోలీసులు ప్రకటించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో మౌనంగా ర్యాలీ తీస్తామని భాజపా శ్రేణులు తెలిపాయి. సికింద్రాబాద్ గాంధీ విగ్రహం నుంచి రాణిగంజ్ వరకు ర్యాలీ చేపడతామని భాజపా తెలిపింది. హైకోర్టు కీలక నిర్ణయం కొవిడ్‌వ్యాప్తి దృష్ట్యా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టులో కేసుల ప్రత్యక్ష విచారణలు నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యక్ష లేదా ఆన్‌లైన్ విచారణపై జడ్జిలకు విచక్షణాధికారం ఉంటుందని హైకోర్టు తెలిపింది. తెగిపడ్డ లిఫ్టు.. ముగ్గురికి తీవ్రగాయాలుసిద్దిపేట జిల్లా ములుగు మండలం లక్ష్మక్కపల్లెలో ఆర్‌వీఎం వైద్య కళాశాలలో లిఫ్ట్ తెగిపడింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. గల్వాన్‌లో న్యూఇయర్ Army New Year celebration Galwan: వాస్తవాధీన రేఖ వద్ద భారత సైనికులు నిర్వహించుకున్న కొత్త సంవత్సర వేడుకలకు సంబంధించిన ఫొటోలను ఆర్మీ వర్గాలు విడుదల చేశాయి. తుపాకులు, త్రివర్ణ పతాకాన్ని చేతపట్టి న్యూఇయర్ జరుపుకొన్నారు జవాన్లు. ఖరగ్‌పుర్‌లో కరోనా Coronavirus Cases In IIT Kharagpur: ఐఐటీ ఖరగ్‌పుర్‌లో కరోనా వైరస్ కేసులు భారీగా వెలుగుచూశాయి. సుమారు 60 మందిలో వైరస్ నిర్ధరణ అయినట్లు అధికారులు తెలిపారు. వారిలో 40మంది విద్యార్థులు ఉన్నట్లు పేర్కొన్నారు.కారు అడ్డగించి.. మహిళను లాక్కెళ్లి !MP Woman raped: మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. కుటుంబసభ్యులతో కలిసి విహారానికి వెళ్లి వస్తుండగా.. వాహనాన్ని అడ్డగించి మహిళపై అత్యాచారం చేశారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.21 ఏళ్లకు గ్రీన్ సిగ్నల్.. ఇప్పుడు 28!Karan Johar on Brahmastra: 'బ్రహ్మాస్త్ర' సినిమా మొదలుపెట్టినప్పుడు ఆలియా భట్‌కు 21 ఏళ్లని, ఇప్పడామెకు 28 ఏళ్లని చెప్పారు ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహర్. దీనిని బట్టి సినిమాపై ఆమెకు ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఇక సినిమా ఇంత ఆలస్యం కావడానికి గల కారణాన్ని వెల్లడించారు కరణ్. మార్కెట్లు రయ్- సెన్సెక్స్ దూకుడుStock Market Closing: స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ- సెన్సెక్స్ 672 పాయింట్లు లాభపడి 59వేల 855వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ- నిఫ్టీ 179పాయింట్ల లాభపడి 17వేల 805 వద్ద స్థిరపడింది. పెద్దగా శ్రమపడలేదుటీమ్ఇండియా సీనియర్ స్పిన్నర్ రవి అశ్విన్ బంతితోనే కాకుండా బ్యాట్‌తోనూ రాణిస్తున్నాడు. తాజాగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కీలక పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో తన బ్యాటింగ్ ప్రదర్శనపై స్పందించాడు అశ్విన్.