Poor People in Telangana 2021 : తెలంగాణలో 13.74 శాతం ప్రజలు పేదలని నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. దేశంలోని వివిధ రాష్ట్రాలు, జిల్లాల స్థితిగతులను తెలుసుకోవడానికి నీతిఆయోగ్ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-4 నిర్వహించింది. ఇప్పటివరకు పేదరికాన్ని ఆదాయం, వినియోగం, ఖర్చు ఆధారంగా అంచనా వేస్తూ రాగా... ఈసారి విద్య, వైద్యం, ప్రజలకు అందుబాటులో ఉన్న మౌలికవసతుల ఆధారంగా మదించారు.
Telangana Poverty 2021 : బహుముఖ కోణాల్లో పేదరికం (మల్టీ డైమన్షనల్ పావర్టీ)ను విశ్లేషిస్తూ రూపొందించిన నివేదికను తాజాగా విడుదల చేశారు. దీని ప్రకారం అత్యధిక సంఖ్యలో పేదలున్న రాష్ట్రాలుగా బిహార్ (51.91 శాతం), ఝూర్ఖండ్ (42.16), ఉత్తర్‌ప్రదేశ్ (37.79) తొలి మూడు స్థానాల్లో నిలిస్తే, తెలంగాణ 18వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ 12.31 శాతం బహుముఖ పేదలతో 20వ స్థానంలో ఉంది.