తెలంగాణ

telangana

ETV Bharat / city

విజయవంతంగా కొనసాగుతున్న టీఎస్‌ బీపాస్.. - TS-bPASS is successfully running

రాష్ట్రంలో నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో స్వీయ ధ్రువీకరణ ద్వారా ఏకీకృత విధానంలో భవన నిర్మాణ అనుమతులకు అమల్లోకి వచ్చిన టీఎస్‌-బీపాస్‌ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోంది. కార్యాలయాలకు వెళ్లకుండానే అనుమతులు వస్తున్నాయి.

Telangana State Building Permission Approval and Self-Certification System is successfully running
విజయవంతంగా కొనసాగుతున్న టీఎస్‌ బీపాస్

By

Published : Mar 5, 2021, 7:37 AM IST

రాష్ట్రంలో.. టీఎస్‌-బీపాస్‌ఇప్పటిదాకా పదివేలకు పైగా అనుమతులు ఇవ్వగా వాటిలో 99 శాతం వరకూ రిజిస్ట్రేషన్‌ విధానం లేదా స్వీయ ధ్రువీకరణ ద్వారా తక్షణ అనుమతి లభించినవే కావడం గమనార్హం. ఇప్పటివరకు పాత విధానంలో అనుమతులను కూడా సమాంతరంగా అమలు చేస్తూ వచ్చిన పురపాలక శాఖ ఇప్పుడు టీఎస్‌-బీపాస్‌నే పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకువచ్చింది. దరఖాస్తు చేసిన వెంటనే అనుమతులు ఇస్తున్న నేపథ్యంలో నిబంధనల ఉల్లంఘనలపై కఠిన చర్యలకు రంగం సిద్ధమవుతోంది. కలెక్టర్ల నేతృత్వంలో టాస్క్‌ఫోర్సు బృందాల ఏర్పాటు జరుగుతోంది. నగరాలు, పురపాలక సంఘాల్లో నిర్మాణంలో ఉన్న అన్ని భవనాలను పరిశీలించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. త్వరలో లేఅవుట్‌లకు కూడా టీఎస్‌-బీపాస్‌ ద్వారానే అనుమతించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

  • స్వీయ ధ్రువీకరణతో అనుమతి తీసుకున్న 21 రోజుల తర్వాతే నిర్మాణం ప్రారంభించాల్సి ఉంటుంది. నిబంధనలకు విరుద్ధంగా భవనాలను నిర్మిస్తే చర్యలు తీసుకునేందుకు కలెక్టర్‌ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ స్క్వాడ్‌లను ఏర్పాటు చేస్తారు.
  • పురపాలకశాఖ సూర్యాపేట పట్టణాన్ని ప్రయోగాత్మక పరిశీలనకు అమలుకు ఎంపిక చేసింది. ఇక్కడ నిర్మాణంలో ఉన్న అన్ని భవనాలను జిల్లా టాస్క్‌ఫోర్సు బృందం త్వరలో పరిశీలిస్తుంది. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేస్తారు.
  • ఈ విధానంలో ఇప్పటి దాకా 10,227 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో స్వీయ ధ్రువీకరణ ద్వారా తక్షణం అనుమతి పొందినవి 72 శాతం ఉన్నాయి. మరో 27 శాతం రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం ద్వారా అనుమతి పొందినవి. మిగిలినవి ఒక శాతం.

ABOUT THE AUTHOR

...view details