పదో తరగతి విద్యార్థుల గ్రేడ్లను నేడు వెల్లడించనున్నారు. ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించనున్నారు. సుమారు సగం మంది విద్యార్థులకు 10 జీపీఏ దక్కినట్లు తెలుస్తోంది.
కరోనా తీవ్రత కారణంగా ఈ ఏడాది పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. ఎఫ్ఏ మార్కుల ఆధారంగా తుది మార్కులు కేటాయించి గ్రేడ్లు ఖరారు చేయాలని ఆదేశిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. పరీక్ష రుసుము చెల్లించిన 5 లక్షల 21 వేల 393 మందిని ప్రభుత్వ పరీక్షల విభాగం ఉత్తీర్ణులు చేసి గ్రేడ్లను ఖరారు చేసింది.