పదో తరగతి ఫలితాల రేపు విడుదల కానున్నాయి. ఎఫ్ఏ-1 మార్కుల ఆధారంగా తుది మార్కులు కేటాయించి గ్రేడ్లు ఖరారు ఆదేశిస్తూ విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా తీవ్రత కారణంగా ఈ ఏడాది పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయం మేరకు పరీక్షా రుసుం చెల్లించిన 5,21,393 మందిని ఉత్తీర్ణులు చేసి గ్రేడ్లు ప్రకటించేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం ఏర్పాట్లు చేసింది.
రేపే పదో తరగతి ఫలితాలు.. గ్రేడ్లు ఇలా నిర్ణయిస్తారు
పదో తరగతి ఫలితాల విడుదలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నిన్న పచ్చజెండా ఊపారు. రేపు వెలువడనున్న ఫలితాల్లో ఎఫ్ఏ-1 మార్కుల ఆధారంగా గ్రేడ్లు కేటాయించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది.
రేపే పదో తరగతి ఫలితాలు.
ఫలితాల విడుదలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆమోద ముద్ర వేయడం వల్ల.. మార్కుల అప్లోడింగ్ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. రేపు ఫలితాలు వెల్లడించేందుకు కసరత్తు చేస్తున్నారు. దాదాపు సగం మంది విద్యార్థులకు 10 జీపీఏ దక్కే అవకాశం కనిపిస్తోందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇవీ చూడండి:పన్ను చెల్లింపుదారులకు ఐటీ శాఖ కొత్త పోర్టల్