తెలంగాణ

telangana

ETV Bharat / city

ప్యాలెస్‌ ఆఫ్‌ వర్సైల్స్‌ స్ఫూర్తిగా నూతన సచివాలయం

సచివాలయ నూతన భవన సముదాయానికి ఫ్రాన్స్‌కు చెందిన ప్యాలెస్‌ ఆఫ్‌ వర్సైల్స్‌ని స్ఫూర్తిగా తీసుకోవటం విశేషం. ఫ్రెంచి విప్లవం తరవాత కూడా ఇది ఎన్నో చారిత్రక ఘట్టాలకు వేదిక అయింది.

TELANGANA SECRETARIAT
ప్యాలెస్‌ ఆఫ్‌ వర్సైల్స్‌ స్ఫూర్తిగా నూతన సచివాలయం

By

Published : Jul 8, 2020, 6:38 AM IST

సచివాలయ నూతన భవన సముదాయానికి ఫ్రాన్స్‌కు చెందిన ప్యాలెస్‌ ఆఫ్‌ వర్సైల్స్‌ని స్ఫూర్తిగా తీసుకోవటం విశేషం. 1623లో రాజు లూయీస్‌-13 ఈ ప్యాలెస్‌ను నిర్మించారు. ఈ భవనం అద్భుతమైన ఆకృతితో అడుగడుగునా కళాత్మకతతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది సందర్శకులను ఆకట్టుకుంటుంది. రాజు లూయీస్‌-13 వేటకు వెళ్లిన సందర్భంలో విడిది చేసేందుకు ఈ నిర్మాణాన్ని చేపట్టారు. వర్సైల్స్‌ గ్రామ సమీపంలో ఏడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ప్యాలెస్‌లో 700 గదులున్నాయి. ఆనాటి ఫ్రెంచి విప్లవానికి ఇది ప్రత్యక్ష సాక్షిగా నిలిచింది. ఫ్రెంచి విప్లవం తరవాత కూడా ఇది ఎన్నో చారిత్రక ఘట్టాలకు వేదిక అయింది. మొదటి ప్రపంచ యుద్ధం అధికారిక ముగింపు ఒప్పందం 1919 జూన్‌ 28న ఈ ప్యాలెస్‌లోని హాల్‌ ఆఫ్‌ మిర్రర్స్‌లో జరగటం విశేషం.

ABOUT THE AUTHOR

...view details