తెలంగాణ

telangana

ETV Bharat / city

తెలంగాణ ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్..! - SAMME

ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది.. అక్టోబర్​ 5న ఉదయం నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు టీఎస్‌ ఆర్టీసీ సంఘాలు తెలిపాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ప్రధానంగా డిమాండ్​ చేస్తున్నారు. సమ్మె నుంచి సెక్యూరిటీ, పారామెడికల్ సిబ్బందిని మినహాయించినట్లు వెల్లడించారు.

తెలంగాణ ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్..!

By

Published : Sep 29, 2019, 4:47 PM IST

తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. అక్టోబర్​ 5న ఉదయం నుంచి సమ్మె ప్రారంభమవుతుందని జేఏసీ ప్రకటించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్‌తో కార్మిక సంఘాలు గతంలో సమ్మెకు నోటీసులిచ్చాయి. టీఎస్‌ ఆర్టీసీ సంఘాలు అత్యవసరంగా సమావేశమై సమ్మె నోటీసులిచ్చినా యాజమాన్యం స్పందించకపోవడం, కనీసం సంప్రదింపులు జరపకపోవడంపై కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్‌ భవన్ ముందు తెలంగాణ మజ్దూర్ యూనియన్, ఎంప్లాయిస్ యూనియన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, సూపర్‌ వైజర్‌ అసోషియేషన్‌ జేఏసీ నేతలతో కలిసి అశ్వద్దామరెడ్డి తమ సమస్యలను వివరించారు. సమ్మె నుంచి సెక్యూరిటీ సిబ్బంది, పారామెడికల్ సిబ్బందిని మినహాయించినట్లు వెల్లడించారు.

తెలంగాణ ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్..!

ABOUT THE AUTHOR

...view details