తెలంగాణ

telangana

ETV Bharat / city

RTC Buses For Sankranti : సంక్రాంతికి 4,360 ప్రత్యేక బస్సులు - తెలంగాణ ఆర్టీసీ

RTC Buses For Sankranti : సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లేందుకు తెలంగాణ ఆర్టీసీ 4,360 ప్రత్యేక బస్సులను నడపనుంది. కరోనా వ్యాప్తి, ఒమిక్రాన్ కేసుల పెరుగుదలతో పండుగ ప్రయాణం.. సాఫీగా.. ఆరోగ్యంగా సాగేలా ఏర్పాట్లపై దృష్టి సారించింది.

RTC Buses For Sankranti
RTC Buses For Sankranti

By

Published : Jan 4, 2022, 8:18 AM IST

RTC Buses For Sankranti : సంక్రాంతి పర్వదినం నేపథ్యంలో.. సొంతూళ్లకు వెళ్లే ప్రజల సౌకర్యార్థం 4,360 ప్రత్యేక బస్సులను నడపాలని టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. ఇందులో 590 సర్వీసులకు రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూనే.. పండగ ప్రయాణాలు సాఫీగా సాగేలా ఏర్పాట్లపై దృష్టి సారించింది.

ఏపీలోని 30 పట్టణాలకు బస్సులు..

TSRTC Buses For Sankranti 2022 : ఆదిలాబాద్‌, ఖమ్మం, భద్రాచలం సెక్టార్లతో కలిపి.. ఏపీలోని 30 పట్టణాలకు, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లకు రాకపోకలు సాగించే బస్సులకూ రిజర్వేషన్‌ అందుబాటులోకి తెచ్చింది. అవసరమైతే అప్పటికప్పుడు సర్వీసుల సంఖ్య పెంచేందుకు టీఎస్‌ఆర్టీసీ కసరత్తు చేస్తోంది. సంక్రాంతి సర్వీసుల విషయమై ఆర్టీసీ ఉన్నతాధికారులతో ఎండీ వీసీ సజ్జనార్‌ మంగళవారం బస్‌ భవన్‌లో సమీక్షించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details