Telangana corona cases: తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 70,697 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1825 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఫలితంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,95,855కి చేరింది. కరోనా బారిన పడి మరొకరు మృతిచెందారు. మొత్తం మరణాల సంఖ్య 4,043 చేరింది. తాజాగా కొవిడ్ నుంచి మరో 351 మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటి వరకు 6,76,817 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,995 కొవిడ్ యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 1042, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 201, రంగారెడ్డి జిల్లాలో 147, సంగారెడ్డిలో 51 మందికి అత్యధికంగా కరోనా సోకింది.
Telangana corona cases: రాష్ట్రంలో కొత్తగా 1825 కరోనా కేసులు - total number of covid 19 cases in telangana
telangaan corona news
18:49 January 10
రాష్ట్రంలో కొత్తగా 1825 కరోనా కేసులు
ప్రకాశ్‌కారత్, బృందా కారత్కు కరోనా..
సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్‌కారత్, బృందా కారత్‌లు కొవిడ్ బారిన పడ్డారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఎంబీభవన్‌లో హోంఐసోలేషన్‌లో ఉన్నారు. నగరంలో జరిగిన సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాల్లో పాల్గొన్న వీరిద్దరూ.. కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ నిర్ధారణ అయింది.
ఇదీచూడండి:కరోనాపై రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్- రాత్రి 10 గంటల వరకు టీకా!
Last Updated : Jan 10, 2022, 8:31 PM IST