CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 405 కరోనా కేసులు, 3 మరణాలు నమోదు - telangana total corona cases
19:19 August 16
రాష్ట్రంలో కొత్తగా 405 కరోనా కేసులు, 3 మరణాలు నమోదు
రాష్ట్రంలో ఇవాళ 84,262 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 405 మందికి వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసులు 6,52,785కు చేరింది. మహమ్మారి బారినపడి మరో ముగ్గురు మరణించారు. మొత్తం మరణించిన వారి సంఖ్య 3,845కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.
తాజాగా మరో 577 మంది బాధితులు.. కొవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 7,093 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
ఇదీచూడండి:Ramya Murder case : "ఇన్స్టా' పరిచయమే ప్రాణం తీసింది.. ప్రజలు అడ్డుకుంటే బతికేదేమో"