రాష్ట్రంలో మరో 3,821 కరోనా కేసులు, 23 మరణాలు - second wave corona cases in telanagana
19:44 May 25
రాష్ట్రంలో మరో 3,821 కరోనా కేసులు, 23 మరణాలు
రాష్ట్రంలో కొవిడ్ నిర్ధరణ పరీక్షలు పెంచటంతో కేసులు సంఖ్య స్వల్పంగా పెరిగింది. సోమవారం సాయంత్రం ఐదున్నర నుంచి ఈ సాయంత్రం ఐదున్నర వరకు 81,203 మందికి కరోనా పరీక్ష ఫలితాలు రాగా 3,821 మందికి పాజిటివ్ వచ్చినట్టు వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఈ కేసులతో కలిపి ఇప్పటివరకు నమోదైన కొవిడ్ కేసుల సంఖ్య.. 5,60,141కి చేరింది.
కొవిడ్ బారినపడి మరో 23 మంది చనిపోగా... రాష్ట్రంలో నమోదైన మరణాల సంఖ్య 3,169కి పెరిగాయి. కొవిడ్ నుంచి 4,298 మంది కోలుకోగా ఇప్పటివరకు వైరస్‌ను జయించిన వారి సంఖ్య.. 5,18,266కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 38,706 ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది.
ఇవీచూడండి:జిల్లాల్లోనూ బ్లాక్‌ఫంగస్‌కు చికిత్స: డీఎంఈ రమేశ్‌రెడ్డి