ఎక్కడి నుంచి వచ్చిందో... ఎలా వచ్చిందో తెలియదు గానీ.... దయ గల తల్లులు అందించే ఆహారం తింటూ... తన అన్న రాక కోసం.. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వృద్ధురాలు ఎదురుచూస్తోంది. ఏపీలోని విజయనగరం జిల్లా పార్వతీపురంలోని బెలగాం నాయుడు వీధిలో రోడ్డు పక్కన ఓ వృద్ధురాలు మూడు రోజులుగా కాలం వెల్లదీస్తోంది. ఈ విషయాన్ని స్థానికులు ఈనాడు-ఈటీవీ భారత్ దృష్టికి తీసుకురాగా... ఆమె వివరాలు సేకరించారు.
ఊరుకాని ఊరులో... అవ్వ అవస్థలు - పార్వతిపురంలో తెలంగాణ అవ్వ
మా అన్నయ్య వస్తాడంటూ... ఓ వృద్ధురాలు మూడు రోజులుగా రోడ్డు పక్కనే ఎదురు చూస్తోంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ అవ్వ ఏపీలోని విజయనగరం వెళ్లింది. రోడ్డు పక్కనే ఉన్న మెట్లపై ఉంటూ... స్థానికులు పెట్టింది తిని కాలం వెళ్లదీస్తోంది.
ఊరుకాని ఊరులో... అవ్వ అవస్థలు
ఆమె వద్ద ఉన్న రైలు టికెట్‌పై ఎస్.సత్యవతి 75 ఏళ్ల వయసు... రామగుండం టూ విశాఖ అని ఉంది. విశాఖ నుంచి బస్సులో పార్వతీపురం చేరుకున్నట్లు బాధితురాలు చెబుతోంది. తనకు ఎవరూ లేరని స్వగ్రామం కావనపురం అని కూరగాయల వ్యాపారం చేసి జీవనం సాగించినట్లు చెబుతోంది. ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ఆమెకు కరోనా పరీక్షలు చేయించి.. నెగిటివ్ నిర్ధరణ తర్వాత బస కేంద్రానికి తరలించారు.
ఇవీ చూడండి:10 గ్రేడ్లపై ముమ్మర కసరత్తు .. విద్యార్థుల్లో టెన్షన్ టెన్షన్