Telangana Corona Cases: రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 1,13,670 మందికి కొవిడ్ నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. 4,559 మందికి మహమ్మారి సోకినట్టు నిర్ధరణైంది. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 1,450 కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. మహమ్మారి కారణంగా మరో ఇద్దరు మృతి చెందారు. దీంతో మొత్తం కొవిడ్ మరణాల సంఖ్య 4,077 కి చేరింది.
Telangana Corona Cases: రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి.. కొత్తగా 4,559 కేసులు.. - తెలంగాణలో కరోనా కేసులు
19:35 January 25
Telangana Corona Cases: రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి.. కొత్తగా 4,559 కేసులు..
వైరస్ నుంచి మరో 1,961 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 36,269 క్రియాశీల కేసులున్నాయి. కరోనా మహమ్మారి పట్ల ప్రజలు అలసత్వం వహించొద్దని వైద్యారోగ్య శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ విధిగా కొవిడ్ నిబంధనలను పాటించాలని సూచిస్తున్నారు. మాస్కు ధరించడం, భౌతికదూరం పాటించడం, శానిటైజేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని చెబుతున్నారు.
Corona cases in India: భారత్‌లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గింది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు.. 2,55,874 కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో మరో 614 మంది మరణించారు. 2,67,753 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 15.52 శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
- మొత్తం కేసులు:3,97,99,202
- మొత్తం మరణాలు:4,90,462
- యాక్టివ్ కేసులు:22,36,842
- మొత్తం కోలుకున్నవారు:3,70,71,898
ఇదీ చూడండి: