Koppula Eshwar on Singareni Blocks Privatization: సింగరేణి సంస్థ హక్కులను హరించేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. సింగరేణిలో 4 బొగ్గు బ్లాకులను ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. ఇక్కడి బొగ్గు నిల్వలు 12 ఏళ్లలో పూర్తవుతాయని.. కొత్త బ్లాకులకు అవకాశం కల్పించాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. కొత్త బ్లాకులకు అనుమతి ఇవ్వకపోగా.. ఉన్నవి ప్రైవేటు పరం చేసేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు.
సింగరేణి సంస్థను ప్రైవేటు పరం చేసేందుకు కేంద్రం యత్నిస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా అమ్మేందుకు కుట్ర పన్నుతోంది. దేశవ్యాప్తంగా 98 బొగ్గు బ్లాకులను ప్రైవేటుపరం చేసేందుకు చూస్తోంది. కొత్త చట్టాలను తీసుకొచ్చి బలవంతంగా సంస్థలపై రుద్దుతోంది.
-కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి