ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలుగుత్తా నామినేషన్ TS Council Chairman: శాసనమండలి ఛైర్మన్ పదవికి గుత్తా సుఖేందర్‌రెడ్డి నామపత్రాలు సమర్పించారు. రేపు ఉదయం 11 గంటలకు ఎన్నిక నిర్వహించనున్నారు. రెండోసారి శాసనమండలి ఛైర్మన్‌గా అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్, కేటీఆర్‌కు గుత్తా కృతజ్ఞతలు తెలిపారు.రేపు కందికొండ అంత్యక్రియలుLyricist Kandikonda : ప్రముఖ సినీగేయ రచయిత కందికొండ యాదగిరి కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. హైదరాబాద్ ఫిల్మ్‌ఛాంబర్‌లో గేయ రచయిత కందికొండ యాదగిరి భౌతికకాయానికి ఆయన నివాళి అర్పించారు.రామయ్య దర్శనానికి బారులు Devotees Rush in Bhadradri: ఆదివారం కావడంతో భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో తెల్లవారుజామునుంచే ఆలయ పరిసరాల్లో రద్దీ నెలకొంది. దీంతో స్వామి వారి ప్రత్యేక దర్శనానికి గంట, ఉచిత దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది.మోదీ 'మేజిక్'!UP Polls 2022: ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు హిందుత్వం, రామ మందిరం వంటి అంశాలను కాకుండా.. సంక్షేమాన్ని చూసి ఓటు వేసినట్లు ది లోక్‌నీతి-సీఎస్డీఎస్ సంస్థలు నిర్వహించిన పోస్ట్ పోల్ సర్వేలో వెల్లడైంది. మరోమారు ప్రధాని మోదీ మేజిక్ పనిచేసిందని, రాష్ట్రం కంటే కేంద్ర ప్రభుత్వ పనితీరుతో ప్రజలు ఎక్కువ సంతృప్తితో ఉన్నట్లు అధ్యయనం తేల్చింది.కాంగ్రెస్ స్కెచ్! Congress Parliamentary Party: దిల్లీలోని 10 జన్‌పథ్‌లో కాంగ్రెస్ పార్లమెంటరీ వ్యూహ బృందం భేటీ అయింది. సోమవారం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల రెండో భాగం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించి ఉభయ సభల్లో అనుసరించాల్సిన అంశాలపై చర్చించారు నేతలు.ఇంటికి రావాలని ఉంది: ఉక్రెయిన్ ఆర్మీలోని 'భారతీయుడు'Ukraine Army Sainikesh: రష్యా- ఉక్రెయిన్ భీకర యుద్ధంలో ఉక్రెయిన్ తరఫున పోరాడుతున్నాడు భారతీయ యువకుడు సైనికేశ్ రవిచంద్రన్. అయితే తాజాగా ఇంటిపై బెంగ పెట్టుకున్న సైనికేశ్.. స్వదేశానికి రావాలని ఉందని చెప్పినట్లు అతడి తండ్రి 'ఈటీవీ భారత్'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపాడు.రష్యా సరికొత్త అస్త్రం.. Ukraine Crisis Latest News: ఉక్రెయిన్ను ఎలాగైనా వశం చేసుకోవాలని రష్యా విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఉక్రెయిన్‌లోని సామాన్య పౌరులకు అందుతున్న సహాయక చర్యలను సైతం అడ్డుకుంటున్నాయి రష్యా సేనలు. సహాయక సామగ్రి కాన్వాయ్‌పైనా రష్యా దాడులు చేస్తోంది.ఒకేరోజు 81 మందికి ఉరిశిక్ష!Saudi Arabia Executions: హత్యలు, ప్రార్థనా స్థలాలపై దాడులు, ఉగ్రవాదం వంటి క్రూరమైన నేరాలకు పాల్పడిన 81 మంది నేరస్థులకు ఒకేరోజు ఉరిశిక్ష అమలు చేశారు. గల్ఫ్ రాజ్య ఆధునిక చరిత్రలో ఇదే అతిపెద్ద సామూహిక మరణశిక్షల అమలు చర్యగా చెప్పవచ్చు.హాట్ ట్రీట్.. ఎప్పుడూ హాట్‌గా, డిఫరెంట్ స్టైలిష్ డ్రెస్‌లలో దర్శనమిచ్చే జాక్వెలిన్ ఈ సారి చీరకట్టులో కనిపించి అభిమానులను ఫిదా చేసింది. ఈమెతో పాటు చిత్రాంగదా సింగ్, సోనాక్షి సిన్హా, పూజా హెగ్డే సహా పలువురు ముద్దుగుమ్మలు తమ కొత్త పోజులతో ఫ్యాన్స్‌ను అలరించారు. వాటిని చూసేద్దాం..మత్తెక్కించే కళ్లతో.. ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్‌లో మూడు బంగారు పతకాలు సాధించిన స్కీట్ షూటర్ అంబర్ జో హిల్. ఇంగ్లండ్‌కు చెందిన ఈ భామ తన పిల్లి కళ్ల అందాలతో కట్టిపడేస్తుంది. కుర్రకారును కవ్విస్తున్న ఆ భామ ఫోటోలపై మీరు ఓ కన్నేయండి.