ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలుకొత్త సంవత్సరానికి ఘన స్వాగతం పలికిన న్యూజిలాండ్ New year celebrations: ప్రపంచదేశాల్లో నూతన సంవత్సర వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి. న్యూజిలాండ్ 2022కు స్వాగతం పలికిన తొలిదేశంగా నిలిచింది. అక్కడి ఆక్లాండ్ నగరం అన్ని దేశాల కంటే ముందుగా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టింది.విజయ డెయిరీ పాల ధరలు పెంపు.. Vijaya Dairy milk price hike: రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సంస్థ ద్వారా సరఫరా చేస్తున్న విజయ తెలంగాణ పాల ధరలు పెరిగాయి. లీటరు పాలపై 2 రూపాయలు, హోల్ మిల్క్‌పై 4 రూపాయల చొప్పున విక్రయ ధరలు పెంచినట్లు ఆ సంస్థ వెల్లడించింది.రేపటి నుంచే నుమాయిష్ numaish in hyderabad 2022 : భాగ్యనగరవాసులను అలరించేందుకు నుమాయిష్ సిద్ధమైంది. 45 రోజుల పాటు జరగనున్న ప్రదర్శనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. హైకోర్టు మార్గదర్శకాలు అమలు చేస్తూ.. నిర్వహిస్తామని ఎగ్జిబిషన్ సొసైటీ ప్రకటించింది.5 గంటల నుంచి బీచ్‌లు, పార్కుల్లోకి నో ఎంట్రీ!Night Curfew in Mumbai: కరోనా కేసుల పెరుగుదలతో ముంబయిలో మరిన్ని కఠిన ఆంక్షలు విధించారు పోలీసులు. సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు బీచ్‌లు, పార్కులు, ఇతర బహిరంగ స్థలాలకు ప్రజలు రాకుండా నిషేధించారు. జనవరి 15 వరకు ఈ నిబంధనలు అమలులో ఉండనున్నాయి.భర్తతో గొడవ.. నలుగురు పిల్లలతో కలిసి మహిళ ఆత్మహత్య Woman jumps into well with kids: భర్తతో గొడవపడిన ఓ మహిళ దారుణానికి ఒడిగట్టింది. నలుగురు పిల్లలతో సహా బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.'ఆర్ఆర్ఆర్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సీఎం!RRR Pre-Release Event: 'ఆర్ఆర్ఆర్' ప్రచారంలో భాగంగా కర్ణాటకలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహణకు చిత్రబృందం సిద్ధమవుతోంది. జనవరి 2న జరిగే ఈ కార్యక్రమానికి సీఎం బసవరాజు బొమ్మై అతిథిగా రానున్నారట.వదంతులపై ఇళయరాజా క్లారిటీIlayaraja health: తన ఆరోగ్యంపై వస్తున్న వదంతులను పాట పాడి మరీ చెక్ పెట్టారు మాస్ట్రో ఇళయరాజా. అలానే న్యూ ఇయర్ విషెస్ కూడా చెప్పారు.'టీమ్ఇండియా తర్వాతి కెప్టెన్ అతడే'Rahul Dravid: క్రికెట్లో రాహుల్ ద్రవిడ్ ఒక లెజెండ్. 'ది వాల్'గా పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత పుజారా నయావాల్‌గా అవతరించినా ప్రస్తుతం ఫామ్‌లేమితో తీవ్రంగా సతమతమవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు టీమ్ఇండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్. ప్రస్తుత జట్టులోని ఓ ఆటగాడిని చూస్తుంటే తన మాజీ సహచరుడు రాహుల్ ద్రవిడ్ గుర్తుకొస్తున్నాడని చెప్పాడు.ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీ షురూ! Ola Electric scooters: బుక్ చేసుకున్న వారందరికీ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లను డెలివరీ చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ఇప్పటికే వాటిని డిస్పాచ్ చేసినట్లు వెల్లడించింది. త్వరలోనే రెండో విడత బుకింగ్ ఓపెన్ చేస్తామని చెప్పింది.బుల్ జోరు- సెన్సెక్స్ 460 ప్లస్Stock Market Today: 2021 ఏడాది ఆఖరు సెషన్లో బుల్ జోరు ప్రదర్శించింది. ఫలితంగా దేశీయ సూచీలు లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 460 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 150 పాయింట్లు లాభపడింది.