తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​న్యూస్​@ 3PM - telugu news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

telangana latest  top news
telangana latest top news

By

Published : Dec 30, 2021, 2:59 PM IST

  • 'ఒమిక్రాన్ ఎఫెక్ట్​.. రాష్ట్రవ్యాప్తంగా ఆంక్షలు'

ఒమిక్రాన్ కట్టడిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఆంక్షలు అమలుచేస్తున్నట్లు డీజీపీ మహేందర్​రెడ్డి వెల్లడించారు. ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధం విధిస్తున్నట్లు చెప్పారు.

  • కేసుల పెరుగుదల థర్డ్​వేవ్​కు సంకేతమే..

omicron variant in telangana: కరోనా మూడో దశను ఎదుర్కొనేందుకు వైద్యారోగ్య శాఖ అన్ని విధాలుగా సన్నద్ధంగా ఉందని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డా. శ్రీనివాస రావు స్పష్టం చేశారు. 2, 3 రోజుల నుంచి రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నాయని.. కేసుల పెరుగుదల మూడో దశకు సంకేతమని పేర్కొన్నారు.

  • 'సాధ్యమైనంత వరకు ఇళ్లలోనే ఉండండి'

New Year Restrictions in Hyderabad: కొత్త సంవత్సరానికి ఉత్సాహంగా స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారా? అయితే... ఈ నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందే. నూతన సంవత్సర వేడుకలపై రాచకొండ ట్రాఫిక్ పోలీసుల ఆంక్షలు విధించారు. సాధ్యమైనంత వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచించారు. రేపు రాత్రి 11 గంటల నుంచి ఓఆర్‌ఆర్‌పై కార్లకు అనుమతి నిరాకరించారు.

  • 'స్టే ఇవ్వలేం'

Telangana High Court On GO-317 :కొత్త జిల్లాలకు ఉద్యోగుల కేటాయింపునకు సంబంధించిన జీవో 317పై... స్టే ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. జీవో 317ను సవాల్‌ చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. కేటాయింపు ప్రక్రియపై స్టే ఇవ్వలేమని హైకోర్టు పునరుద్ఘాటించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సర్కారును ఆదేశించింది.

  • మరో రైల్వే స్టేషన్​ పేరు మార్చిన యూపీ..

Jhansi railway station new name: ఇప్పటికే రెండు రైల్వే స్టేషన్ల పేర్లు మార్చిన ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం.. తాజాగా మరో స్టేషన్​ మారును మార్చుతున్నట్లు స్పష్టం చేసింది. ఝాన్సీ రైల్వే స్టేషన్​ను... వీరాంగణ లక్ష్మీబాయి రైల్వే స్టేషన్​గా మార్చుతున్నట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు.

  • 'యథాతథంగా యూపీ అసెంబ్లీ ఎన్నికలు!'

UP polls 2022: ఉత్తర్​ప్రదేశ్​లో మూడురోజులు పర్యటించిన కేంద్ర ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర.. కీలక వ్యాఖ్యలు చేశారు. కొవిడ్ నిబంధనల ప్రకారం ప్రణాళిక ప్రకారమే.. ఎన్నికలు నిర్వహించాలని రాజకీయ పార్టీలు తమను కోరాయని చెప్పారు. ఈ మేరకు ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

  • సల్మాన్​ బర్త్​డేకు కత్రినా ఏమిచ్చిందంటే?

Salman Khan: ఇటీవలే తన 56వ పుట్టిన రోజు వేడుకను ఘనంగా చేసుకున్నారు బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్. ఈ పార్టీకి బీటౌన్ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు భాయ్​కు రూ.కోట్లు విలువజేసే కారు, బ్రాస్​లెట్​లు కానుకగా ఇచ్చారు. మరి కత్రినా కైఫ్​ ఏమిచ్చిందంటే?

  • కొత్త సినిమా కబుర్లు..

Vijay Devarakonda Liger: కొత్త సినిమా కబుర్లు వచ్చేశాయి. విజయ్​ దేవరకొండ 'లైగర్',​ మాస్​ మహారాజ రవితేజ 'ఖిలాడి' సహా పలు సినిమాల ఆసక్తికర అప్డేట్లు ఇందులో ఉన్నాయి.

  • 'కోహ్లీ బలమే.. బలహీనతగా మారొచ్చు'

Team India Batting Coach: కొన్నిసార్లు విరాట్​ కోహ్లీ బలమే.. అతడి బలహీనతగా మారే అవకాశముందని అన్నాడు భారత జట్టు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్. ఇక ఫామ్​లేమితో సతమతమవుతున్న సీనియర్‌ బ్యాట్స్‌మెన్‌ ఛెతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానె.. తిరిగి పుంజుకునేందుకు శక్తిమేర ప్రయత్నిస్తున్నారని చెప్పాడు.

  • ఈపీఎఫ్​ ఈ-నామినేష‌న్ గడువు పొడిగింపు.. కానీ..

EPF nomination deadline: ఈపీఎఫ్​ ఈ-నామినేష‌న్ జ‌త చేయనివారికి శుభవార్త. డిసెంబ‌రు 31 త‌ర్వాత కూడా ఈ-నామినేష‌న్ జ‌త చేయ‌వ‌చ్చు. దీనికి ఇప్పటివరకు ఎలాంటి గడువు తేదీని నిర్ణయించలేదని పేర్కొంది ఈపీఎఫ్​ఓ. ఈ విషయాన్ని ట్విట్టర్​ వేదికగా వెల్లడించింది.

ABOUT THE AUTHOR

...view details