తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​న్యూస్​ @ 9PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

telangana latest top news
telangana latest top news

By

Published : Dec 29, 2021, 8:58 PM IST

  • రెండు డోసుల టీకా తీసుకున్న వారికే..

New Year Guidelines: కొత్త సంవత్సరానికి ఉత్సాహంగా స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారా? అయితే... ఈ నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందే. న్యూ ఇయర్‌ వేడుకల సందర్భంగా హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ మార్గదర్శకాలు జారీ చేశారు. ఒమిక్రాన్‌ నేపథ్యంలో నయాసాల్‌ వేడుకలపై ఆంక్షలు విధించారు. అర్ధరాత్రి 12 వరకూ మద్యం దుకాణాలు, అర్ధరాత్రి ఒంటిగంట వరకూ బార్లు, పబ్బుల్లో మద్యం సరఫరా ఉంటుందని నిన్న ఉత్తర్వులు వెలువడ్డాయి.

  • తెలంగాణలో 'అమూల్​' డెయిరీ ప్లాంట్

AMUL plant: దక్షిణ భారతదేశంలోనే తొలి డెయిరీ ప్లాంటును అమూల్​ సంస్థ తెలంగాణలో ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం 500 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. అమూల్ సంస్థ నిర్ణయంపై పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.

  • 'నల్గొండను అభివృద్ధి చేసేదాకా నిద్రపోవద్దు'

నల్గొండ పట్టణ అభివృద్ధి కోసం నిబద్ధతతో పనిచేసే మున్సిపల్ కమిషనర్‌ను వెంటనే నియమించాలనీ సీఎం కేసీఆర్ అన్నారు. ఈ మేరకు సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ రమణాచారిని నల్గొండకు వచ్చి పనిచేయాల్సిందిగా సీఎం కేసీఆర్ ఫోన్‌లో ఆదేశించారు. నల్లగొండను అభివృద్ధి చేసే దాకా నిద్రపోవద్దని.. సిద్దిపేటను తీర్చిదిద్దినట్లుగా నల్లగొండనూ తీర్చిదిద్దాలన్నారు.

  • ప్రతి రైతు ఖాతాలో డబ్బులు జమ!

PM Kisan 10th Installment: నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1న పీఎం కిసాన్ నిధులను విడుదల చేయనున్నారు ప్రధాని నరేంద్రమోదీ. దేశవ్యాప్తంగా 10కోట్లకు పైగా రైతు కుటుంబాలకు రూ. 20వేల కోట్లు అందనున్నాయి.

  • మాస్క్ ధరించమన్నందుకు బీభత్సం

Mask fight in bank: ఓ బ్యాంకులో కస్టమర్ బీభత్సం సృష్టించాడు. మాస్కు లేకుండా వచ్చిన అతణ్ని.. అక్కడి సెక్యూరిటీ గార్డు అడ్డుకున్నాడు. దీంతో కోపోద్రిక్తుడైన అతడు గార్డుపై దాడికి పాల్పడ్డాడు.

  • 'ఆయిల్ సర్వే'లో విస్తుపోయే నిజాలు..

Edible oil adulteration: దేశవ్యాప్తంగా వినియోగిస్తున్న వంటనూనెల విషయంలో కీలక విషయాలు వెల్లడించింది భారత సురక్షిత ఆహార, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ). 4,461 నూనె నమూనాలను పరిశీలించగా.. అందులో 2.42శాతం నమూనాలు భద్రతా ప్రమాణాలను ఏ మాత్రం పాటించడం లేదని తెలిపింది. 24.2శాతం నమూనాల్లో నాణ్యతా ప్రమాణాలు పూర్తిగా కరవయ్యాయని చెప్పింది.

  • చిన్నారికి అలెక్సా ఛాలెంజ్.. చివరకు...

Amazon alexa: అమెజాన్ అలెక్సా ఓ పదేళ్ల చిన్నారికి ఇచ్చిన డేంజరస్ ఛాలెంజ్ చర్చనీయాంశమైంది. దీనిపై చిన్నారి తల్లి ట్విట్టర్​ వేదికగా స్పందించి భయాందోళన వ్యక్తం చేసింది. ఛాలెంజ్​ సమయంలో తాను కూతురి పక్కన లేకపోతే ఏం జరిగి ఉండేదో అని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇంతకీ ఆ ఛాలెంజ్​ ఏంటంటే..

  • 'ఏ డైరెక్టర్​కు నేను అలా చెప్పలేను'

Ram charan Bollywood: 'జంజీర్' తర్వాత బాలీవుడ్​లో సినిమాలు చేయకపోవడం గురించి రామ్​చరణ్ మాట్లాడారు. పాన్ ఇండియా చిత్రాల గురింతి తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

  • టీమ్​ఇండియా ఆటగాళ్లకు దక్కని చోటు

Mens T20 player of the year 2021: ఐసీసీ మెన్స్​ టీ20 ప్లేయర్ ఆఫ్​ ది ఇయర్​-2021 అవార్డుకు నామినేట్​ చేసిన ప్లేయర్ల జాబితాను ప్రకటించింది ఐసీసీ. ఇందులో టీమ్​ఇండియా ఆటగాళ్లకు చోటు దక్కలేదు. ఇంతకీ నామినేట్​ అయిన వారు ఎవరంటే?

  • భారత్‌ 174 ఆలౌట్.. దక్షిణాఫ్రికా లక్ష్యం ఎంతంటే?

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్​లో టీమ్​ఇండియా 174 పరుగులకు ఆలౌట్​ అయింది. ఫలితంగా.. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంతో (130) కలుపుకుని ప్రత్యర్థి జట్టు ముందు 305 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

ABOUT THE AUTHOR

...view details