తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​@7 PM - తెలుగు వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

telangana news
telangana news

By

Published : Apr 6, 2021, 6:59 PM IST

మంటల్లో లంచం డబ్బు..

నాగర్‌కర్నూల్​లో మండల పరిషత్‌ మాజీ ఉపాధ్యక్షుడు లంచం డబ్బు తగలబెట్టారు. రూ.5 లక్షలను మంటల్లో వేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

పదో తరగతికి ఉపయుక్తం

పదో తరగతి విద్యార్థుల కోసం స్టడీ మెటీరియల్ విడుదల చేశారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. డిజిటల్ తరగతులతో అవగాహన పొందిన అంశాలను మరింత నేర్చుకునేందుకు స్టడీ మెటీరియల్ ఉపయోగపడుతుందని ఆమె వివరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఉద్రిక్తతల నడుమ బంగాల్​లో పోలింగ్​

బంగాల్‌లో మూడోదశ ఎన్నికల పోలింగ్​ ఉద్రిక్తతల నడుమ జరిగింది. 31 నియోజవర్గాల్లో పోలింగ్​ జరగ్గా.. సాయంత్రం 5 గంటల వరకు 77.67 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

కేరళలో 71.31 శాతం పోలింగ్​

కేరళ శాసనసభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 957 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

పుదుచ్చేరిలో 77.90 శాతం పోలింగ్

పుదుచ్చేరి శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగింది. సాయంత్రం 6 గంటల వరకు 77.90 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. పోలింగ్​ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'మే 2న టీఎంసీ కథ కంచికే!'

బంగాల్​లో మే 2న తృణమూల్ కాంగ్రెస్​ ప్రభుత్వం కథ ముగియనుందని జోస్యం చెప్పారు ప్రధాని మోదీ. బంగాల్​ ప్రజలకు సేవ చేసేందుకు భాజపాకు ఒక్క అవకాశం ఇవ్వాలని హావ్​డా ప్రచార సభ వేదికగా ప్రజలను కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

మార్కెట్లోకి ట్రయంఫ్​ ట్రైడెంట్ 660

భారత మార్కెట్లోకి మిడ్​ వెయిట్​ రోడ్​స్టర్​ సెగ్మెంట్​లో.. ట్రయంఫ్​ ట్రైడెంట్ 660 బైక్​ను విడుదల చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఒప్పో ఎఫ్​ 19 విడుదల

దేశీయ మార్కెట్లోకి సరికొత్త స్మార్ట్​ఫోన్​ను విడుదల చేసింది ఒప్పో. 33 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్​తో వచ్చిన ఈ మోడల్​ ధర, ఇతర విశేషాలు ఇలా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

మహిళా క్రికెట్​​ ర్యాంకింగ్స్​

మహిళల వన్డే ర్యాంకింగ్స్​ను మంగళవారం విడుదల చేసింది అంతర్జాతీయ క్రికెట్​ మండలి (ఐసీసీ). భారత ఓపెనర్​ స్మృతి మంధాన, మిథాలీ రాజ్​, ఫాస్ట్​ బౌలర్​ జులన్​ గోస్వామి, ఆల్​ రౌండర్​ దీప్తి శర్మ తమ స్థానాలను పదిలపరుచుకోగా.. పేసర్​ శిఖా పాండే ఒక స్థానం ఎగబాకి టాప్​ 10లో స్థానం సంపాదించుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

కత్రినా కైఫ్​కు కరోనా ​

బాలీవుడ్​ నటి కత్రినా కైఫ్​కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించింది. ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details